Category సాహిత్యం-శోభ

శిశిరంలోంచి…

బాధల శిశిరం చుట్టుముట్టి పెంచుకున్న ఆశల పత్రాలన్నీ ఆశయాల పుష్పాలన్నీ జీవితం చెట్టు చుట్టూ రాలిపోతూ భయపెడితేనేం!? అది కొత్త ఆశల్ని చిగురింపజేసే ఆమని రాకకు సంకేతమే కదా!… నేస్తం… ఆత్మవిశ్వాసపు తొలకరి మేఘాలు వర్షించినప్పుడు మొగ్గతొడిగన హృదయ రేకులు విచ్చుకొని ఆశల సుగంధాలతో పరిమళిస్తాయి… సంకల్పం తూర్పు నుంచి సరికొత్త కాంతులు వుద్భవించినప్పుడు ఆశయాలు…

దిగులు కవిత

మనం మనకు తెలిసేసరికి మనలోంచి మనం లేచేసరికి మననుంచి మనం దూరం పోయి చూస్తూ వుంటాం ఆ దారం ఒక కొసనుంచి ఇంకో కొసకు పాకుటకు మధ్యలో తెగిన ముళ్ళ కుచ్చులు గొంతులో తట్టినట్టు కడుపులో పిసికినట్టు వదిలేసే వదులులను బిగపట్టే బిగువులను తెలిసి తెలిసి పోగొట్టుకున్న వాటి కషాయాల మొఖం ముడుపులను బిచ్చగత్తె చూపులు…

నల్లని మంచు కరిగి

ఒక్కడినే నా లోపలికెళ్లి తలుపేసుకున్నాను.. అలంకార అహంభావాలను బరువు,పరువులని ఒలిచి పక్కన పెట్టి నిజాలతో నగ్నంగా మూల మూలలో కెళ్లి పారేసుకున్నవి పోగొట్టుకున్నవి  వెతుకుతుంటే గుట్టల జ్ఞాపకాల మధ్య స్పృహ కోల్పోయిన కట్టల కొద్ది కలల్లో ఒక్కో కల ఒక్కో కవితగా గూడుకట్టుకున్న సంకలనం చీకటి తుపానుకు మూలకు విసరకొట్టబడటం చూసాను.. తెరిచేకొద్దీ, నోటికి తగిలే…

దేనికో…!

నిదుర నిండని కళ్ళల్లో పరుగులెత్తే కలలు దేనికో.. హృదయం నిండా లేని రూపానికి పై పై నగిషీలు దేనికో.. మౌనం మాటున దాగిన గానానికి వినిపించని రాగాలెందుకో.. నీలువ నీడలేని ప్రాంతంలో వ్యాపారాలకై ఆతృత దేనికో.. దళారీ వ్యవస్థ ఉన్న నేటి సమాజంలో రైతన్న మీద ఎందుకూ ఉపయోగ పడని  గౌరవం దేనికో.. అత్యంత ధనవంతులు…

ధ్వంసరచన

‘‘ఒక్క అవకాశమన్న’’ తీయని మాటలకు కొమ్ముకాసినందుకు కరువయ్యింది ప్రశాంతత మానవాళికి. ఎటుచూసినా నిరాశానిస్పృహలే, ఏమీచేయలేని నిస్సహాయతలే. ఎదుటివారి అభివృద్ధిని జీర్ణించుకోలేని నయవంచకుల పాలనలో మంచికి,మానవత్వానికి చోటులేదు. అవినీతికి రెక్కల్ని మొలిపిస్తూ సంకుచిత భావాల్ని స్వైరవిహారం చేయిస్తోంటే, సమతా మమతలు కరువవగా ఈర్ష్యా అసూయలలో మునిగి తేలుతూ, మాట నెగ్గించుకోవాలన్న మూర్ఖత్వంతో, కుళ్ళూ కుతంత్రాలతో, ప్రకృతిని హింసిస్తూ…

ఆడంబరాల అనారోగ్యాలు

అనంత కాలచక్ర గమనంలో.. నరులంతా నగదు వేటలో.. ధన కోసమే జీవితం అంటూ.. ఆడంబరాల అనారోగ్య ఆశయాలు ! జీవనయాన నవ్యనర క్షేత్రంలో.. శ్రమలేని విత్తం సాగుబడిలో.. ఆనందమనే కలుపును తొలగిస్తూ.. హైఫై దిగుబడే ఆనందమైతున్నాయి ! ఆనందమా… ఐశ్వర్యమా… కావాలసింది అసలేమిటీ.. ఐశ్వర్యం విలాసాలను జోడిస్తే… ఆనందమే అందించు ఆయురారోగ్యాల్ని ! విత్తం వెంటపడితే..…

నవ్వు-నవ్వించు

నవ్వు ఒక వరం సదా నవ్వితే కలిగించు భోగం రాకుండా చేసును నీకు రోగం దూరం చేయును నీకు దుఃఖం కలిగించు సుఖం గైకొను నీలో అందం అందించు సౌఖ్యం పెంపొందించు స్నేహం దగ్గర చేయును బంధం అంతిమంగా జీవితంలో నవ్వే ప్రధానం నవ్వు లేని బ్రతుకు వ్యర్థం నవ్వ లేని బ్రతుకుకు దొరకదు అర్థం..…

సరేనా?

ఓయ్‌! ‌నిన్నే మానవత్వం కనుమరుగైపోతోంది అన్నదెవరు? నాకు కనపడుతోందే ఆకాశంలో తారలవోలె మిణుకు మిణుకుమంటూ! బంధాలకు అర్థంలేకుండా పోతోంది అన్నదెవరు? కట్టుకున్నదానికి నచ్చలేదనేగా కన్నవారిని అనాధలుగా మారుస్తోంది. అడిగింది తేలేదనేగా నమ్మివచ్చినదానికి ‘‘వేదన’’ కానుకగా ఇస్తోంది. ఎదిగి ఇబ్బంది పడకూడదనేగా ఊహల రెక్కలైనా మొలవని పసిమొగ్గని చిదిమేస్తోన్నది. గుండె డబ్బూ డబ్బూ అని కొట్టుకుంటుంటేనేగా మనీమాయలో…

మమతల పందిరి

కాలంతో పరుగెత్తడం అలవాటు చేసుకున్నాం మార్పు కోరుకోరడంపై నిషేధం విధించుకున్నాం విలువలకు శిలువేసి వీధుల్లో ఊరేగిస్తున్నాం శిలావిగ్రహాల పూజించి మనిషిని ద్వేషిస్తున్నాం మానవత కన్నా మతం గొప్పదని వాదిస్తున్నాం ప్రేమ ఆప్యాతల కాదని విద్వేషాన్ని శ్వాసిస్తున్నాం అనుబంధ వేళ్ళు పెరికి ఆర్థిక బీజాలు వేస్తున్నాం మనిషిగా కాక యంత్రమై చుట్టూ పరిభ్రమిస్తున్నాం యాంత్రిక జీవన తంత్రుల…