Category జాతీయం

చంటిబిడ్డతో అసెంబ్లీకి వొచ్చిన మహిళా ఎమ్మెల్యే

నాగ్‌పూర్‌, ‌డిసెంబర్‌ 19 : ఓ ‌మహిళా ఎమ్మెల్యే నెలల వయసున్న తన పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బాలింత అయి వుండి కూడా బాధ్యతను మరిచిపోకుండా అసెంబ్లీకి వచ్చిన ఆ మహిళా ఎమ్మెల్యేపై సాటి ఎమ్మెల్యేలు అభినందనల వర్షం కురిపించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే…

ఆరోగ్య రక్షణ, శరీర దారుద్ధ్యం కోసం ప్రతి ఒక్కరూ సైకిల్‌ ‌తొక్కాలి

హైదరాబాద్‌, ‌పిఐబి, డిసెంబర్‌ 19 : ‌సైకిల్‌ ‌తొక్కి ఆరోగ్యం, శరీర దారుఢ్యం రక్షించుకోవాలని కేంద్ర మంత్రి డాక్టర్‌ ‌మాండవీయ పిలుపు ఇచ్చారు. శారీరక వ్యాయామం చేయడం ఆరోగ్యం రక్షించుకొనే విధంగా ప్రజలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సోమవారం దిల్లీలో సౌకిల్‌ర్యాలీని నేషనల్‌ ‌బోర్డ్ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌ (ఎన్‌బిఇఎంఎస్‌) ‌నిర్వహించింది. ర్యాలీలో  కేంద్ర…

దిల్లీలో మళ్లీ పెరిగిన వాయుకాలుష్యం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : ‌దిల్లీలోవాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. మోడరేట్‌ ‌కేటగిరి నుంచి వెరీ పూర్‌ ‌కేటగిరికి దిగజారింది. గత రెండు రోజుల నుంచి ఎయిర్‌ ‌క్వాలిటీ మోడరేట్‌ ‌కేటగిరిలో ఉండగా.. ఇవాళ వెరీ పూర్‌ ‌కేటగిరికి చేరింది. మరో వైపు ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది.…

హిమాచల్‌ ‌సిఎంకు కొరోనా పాజిటివ్‌

సిమ్లా, డిసెంబర్‌ 19 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్‌ ‌సుఖు కొరోనా బారిన పడ్డారు. సోమవారం ఉదయం 11.00 గంటలకు సుఖ్వీందర్‌ ‌ప్రధాని మోడీతో భేటీ కావాల్సి ఉంది. నిబంధనల ప్రకారం సమావేశానికి ముందు ఆయనకు కొరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అయితే సుఖ్వీందర్‌కు ఎలాంటి లక్షణాలు లేవు. దీంతో ఆయన ప్రధానితో…

గోవా విముక్తి దినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని అభినందనలు

హైదరాబాద్‌, ‌పిఐబి, డిసెంబర్‌ 19 : ‌గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తన ట్వీట్‌లో ‘‘గోవా ప్రజలకు ఇవే గోవా విముక్తి దినం తాలూకు అభినందనలు. గోవాకు విముక్తిని సిద్ధింపచేయడం కోసం జరిగినటువంటి ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరి…

రామ్‌లీలాలలో కిసాన్‌ ‌గర్జన

పెట్టుబడి సాయం రూ.12 వేలకు పెంచాలని డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : ‌భారతీయ కిసాన్‌ ‌సంగ్‌ ఆధ్వర్యంలో దిల్లీలోని రామ్‌ ‌లీలా మైదానంలో కిసాన్‌ ‌గర్జన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు, రైతు నాయకులు భారీ స్థాయిలో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా కిసాన్‌ ‌గర్జన నిర్వహించారు. రైతుల ఆత్మహత్యలు, రైతు…

ఒడిషా నుంచి అక్రమ మద్యం రవాణా

మద్యం తయారీ కేంద్రాల్లో సోదాలు హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 19 : ఒడిశాలోని మద్యం తయారీ డిస్టిలరీలో తెలంగాణ అబ్కారీ పోలీసులు భారీగా అక్ర మద్యాన్ని సీజ్‌ ‌చేశారు. ఒడిశా నుంచి రాష్టాన్రికి పెద్దమొత్తంలో అక్రమ మద్యం పంపిణీ అవుతున్నట్లు ఎక్సైజ్‌ ‌పోలీసులు గుర్తించారు. దీంతో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌ ‌రవికాంత్‌, అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ‌చంద్రయ్య ఆధ్వర్యంలో…

ఎపిలో పెరుగుతున్న అప్పుల భారం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : ఆం‌ద్రప్రదేశ్‌ ‌రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతు న్నట్టుగా పార్లమెంటు  సాక్షిగా కేంద్రం వెల్లడించింది. ఏటేటా విపరీతంగా ఏపీ అప్పుల భారం పెరుగుతోందని స్పష్టం చేసింది. బడ్జెట్‌ ‌లెక్కల ప్రకారం 2018లో ఆంధప్రదేశ్‌ అప్పు 2,29,333.8 ‌కోట్లు ఉండగా.. ప్రస్తుతం 3,98,903.6 కోట్లకు చేరినట్లుగా లిఖితపూర్వకంగా కేంద్రం తెలిపింది.…

పెరుగుతున్న బంగారం ధరలతో బెంబేలు

ముంబై, డిసెంబర్‌ 19 : ‌బంగారం ధరలు భయపెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ ‌కావడంతో రోజురోజుకూ పెరుగుతోంది. 10 గ్రాముల  బంగారం ధర రూ.55 వేలకు చేరువలో ఉండటం సామాన్యులను కలవర పెడుతోంది. నిజానికి పెళ్లిళ్ల సీజన్‌ ‌కావడంతో బంగారానికి డిమాండ్‌ ‌భారీగానే ఉంది. కానీ రేటు చూస్తే కొండెక్కి కూర్చుంది. దీంతో బంగారం కొనలేక.. కొనక…