Category జాతీయం

‌ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత

అహ్మదాబాద్‌, ‌డిసెంబర్‌ 28 : ‌ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ ‌మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్‌లోని యూఎన్‌ ‌మెహతా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ్య వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌ ‌వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ‌పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా…

శబరి ఆలయం తాత్కాలికంగా మూసివేత

రేపు సాయంత్రం తెరుచుకోనున్న ఆలయం 14న మకర విలక్కు పూజలకు ఏర్పాట్లు పత్తణంతిట్ట, డిసెంబర్‌ 28 : ‌శబరిమల అయ్యప్ప సన్నిధానం తాత్కాలికంగా మూతపడింది. 41 రోజుల మండల పూజలు చేసిన తర్వాత.. తీర్థయాత్ర తొలి విడత ముగిసింది. ఆలయాన్ని తిరిగి ఈనెల 30న శుక్రవారం తెరుస్తారు. జనవరి 14న మకర విళక్కు పూజలు నిర్వహిస్తారు.…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 28 : ‌కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. కొండపై ఉన్న 14 కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనానికి భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. మంగళవారం స్వామివారిని 70,496 మంది దర్శించుకోగా 25,500 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు…

తెలంగాణ సంక్షేమ పథకాలు అద్భుతం

‌హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 27 : ‌తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అద్భుతాలు చేస్తున్నదని, దేశ స్థాయిలో పేరు వచ్చిందని పంజాబ్‌ ‌స్పీకర్‌ ‌కుల్తార్‌ ‌సింగ్‌ ‌ప్రశంసించారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. పేదల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు అభినంద నీయమని అన్నారు. ఉచిత విద్యుత్‌, ‌నిరంతర విద్యుత్‌ ఆదర్శంగా ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమ…

యూఎస్‌ ‌విద్యార్థి వీసాలు మరింత సరళం

న్యూయార్క్, ‌డిసెంబర్‌ 27 : అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటున్న వారికి వీసా నిబంధనలు సరళీకృతం కానున్నాయి. ఈ విషయంలో అమెరికా మరోమారు ఉదార నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యం అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు  సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీసా ఇంటర్వ్యూలో ఒకసారి ఫెయిల్‌ అయిన స్టూడెంట్స్‌కు మరోసారి హాజరయ్యే అవకాశం కల్పించాలని…

ఉత్కంఠంగా దిల్లీ మేయర్‌ ఎన్నిక

బలం లేకున్నా బరిలోకి దిగిన బిజెపి జనవరి 6న జరిగే ఎన్నికపై సర్వత్రా ఆసక్తి న్యూ దిల్లీ, డిసెంబర్‌27: ‌దేశ రాజధాని దిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ఎన్నిక ఉత్కంఠంగగా మారుతోంది. ఆప్‌కు పూర్తి మెజార్టీ ఉన్నా బిజెపి రంగంలోకి దిగుతోంది. దిల్లీలో పాగా వేసేందుకు బిజెపి ఎత్తులు వేస్తున్నది. అధికారంలోకి వచ్చేందుకు కావాల్సినంత సంఖ్యాబలం…

ఎయిర్‌పోర్టుల్లో 3డి స్కానర్‌

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 27 : ‌విమానాశ్రయాల్లో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఏ చిన్న వస్తువునైనా చెక్‌ ‌చేస్తారు. స్కాన్‌ ‌చేసి బ్యాగ్‌ ‌లో అన్ని వస్తువులు పక్కాగా ఉంటేనే వాటిని ప్రయాణానికి అనుమతిస్తారు. అయితే ఇది ఎంతో ప్రయాసతో కూడిన వ్యవహారం. ఈ క్రమంలో ఎయిర్‌ ‌పోర్ట్ ‌సెక్యూరిటీ చెక్‌…

పూరీ తొక్కిసలాటలో ఆరుగురు విద్యార్థులకు గాయాలు

భువనేశ్వర్‌, ‌డిసెంబర్‌ 27 : ‌ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మయూర్‌భంజ్‌  ‌జిల్లాలోని రస్‌గోవింద్‌పూర్‌ ‌ప్రాంతంలోగల హ్రుదానంద హైస్కూల్‌కు చెందిన 70 మంది విద్యార్థులు క్రిస్మస్‌ ‌సెలవు సందర్భంగా పూరీ ఆలయ సందర్శనకు వెళ్లారు. ఆలయానికి 22 మెట్లు ఎక్కుతుండగా…

కోవిడ్‌ ‌టీకాల కోసం అనేక దేశాల్లో ఎదురుచూపు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 27 : అనేక ప్రపంచదేశాల్లో వ్యాక్సినేషన్‌ ‌నేటికీ అందడం లేదు. పలు పేదదేశాలు తమకు టీకా కోసం ఎదరు చూస్తున్నాయి. అభివృద్ది చెందిన దేశాలు పిల్లలకు కోవిడ్‌ ‌టీకా సంగతి ఎలా అని ఆలోచిస్తున్నాయి. అయితే పేదదేశాల్లో సామాన్యులకు కూడా తగిన సంఖ్యలో వ్యాక్సినేషన్‌ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రపంచ ఆరోగ్య…