జీవన సందర్భాల అల్లిక…

ఆశ… విత్తనం లేకుండా పెరిగిన మొక్క యొక్క శ్వాస అంటారు దర్పణం అన్న కవితలో అలిశెట్టి ప్రభాకర్. ఆశల చుట్టూ అల్లిన ఆశయాల పూల పొదరింటి వాకిలి కవిత్వం. విత్తన కలలు వాస్తవాల నడకలైతే సహజమైన నైసర్గిక ఆవిష్కృతి జరుగుతుంది. పరిణామాన్ని కోరితేనే కవిత్వం జ్ఞానదిశను అన్వేషిస్తూ వెనుదిరుగని ప్రయాణం చేస్తుందన్నది నిగ్గుతేలిన నిజం. గాయానికి…