Category ఎడిటోరియల్

కాంగ్రెస్‌కు కష్టకాలం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వరుసగా ఎదురు దెబ్బలను ఎదుర్కుంటున్న కాంగ్రెస్‌ ‌పార్టీ వొచ్చే ఎన్నికల నాటికైనా పుంజుకుంటుందని ఆశిస్తున్న తరుణంలోనే  మరిన్ని ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. వొచ్చే ఎన్నికల్లో గోలకొండపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామన్న ధీమాను ఆ పార్టీ గత కొంతకాలంగా వ్యక్తం చేస్తూ వొస్తుంది. దీంతో పూర్వపు స్థితికి కాకపోయినా కనీసంగానైనా బలపడుతుందన్న…

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు

దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ జండాను ఎగురవేసే సంకల్పంతో భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తుండడంతో తెలంగాణ రాజకీయాల్లో విస్తృత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణాదిలో పెత్తనం చెలాయించాలంటే ముందుగా తెలంగాణను చేజిక్కించుకోవాలన్న లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతున్న విషయం తెలియంది కాదు. కర్నాటక తర్వాత తాజాగా మహారాష్ట్రలో అడుగుపెట్టిన బిజెపి ఇప్పుడు తన దృష్టినంతా తెలంగాణపైనే…

అయిదూళ్ళు ఇవ్వమంటే…

తెలుగు రాష్ట్రాల విభజనాంశాలు మరోసారి వివాదగ్రస్తంగా మారుతున్నాయి. ఈ విభజనలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుండగా, దీనిపై వివాదం చేస్తే మీ భూభాగాన్ని మేము డిమాండ్‌ ‌చేస్తామని ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య తారస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్నది. తాజాగా చర్చనీయాంశంగా మారిన ఆవేశపూరిత ప్రకటనలకు వరుణదేవుడి విశ్వరూపం కారణంగా మారింది.…

పొలిటికల్‌ ‌బరస్ట్

‌రాష్ట్రంలో వరదల కారంణంగా ముంపుకు గురైన ప్రాంతాలను చూడడానికి వెళ్ళిన సందర్భంగారాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్ల్లోకూడా దీనిపై దుమారం లేస్తున్నది. గత వారంరోజులుగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాల వల్ల గోదావరి…

ముందస్తుకు సై అంటున్న రాజకీయ పార్టీలు

ముందస్తు ఎన్నికలకు రాజకీయ పార్టీలుకూడా సిద్ధమంటున్నాయి.. నిన్నటివరకు టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ వొచ్చిన ఈ పార్టీలు ఇప్పుడు తాము కూడా సిద్ధ్దమేనంటు ప్రకటనలు చేస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయను కున్నప్పుడు సహజంగా అధికార పార్టీ ముందుచూపుగా ముందస్తు ఎన్నికలకు సిద్ధ్దమవుతాయి. 2018లో టిఆర్‌ఎస్‌…

పోడు గర్జనకు సిద్ధమవుతున్న ఆదివాసీలు

గిరిజన, ఆదివాసీలకు పోలీసు, ఫారెస్టు అధికారులమధ్య పోడుపై జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని మరింత ఉధృతం చేసేందుకు ‘ఆదివాసీ గిరిజన సంఘాల పోడు గర్జన’ పేర తమ హక్కుల సాధనకు మరింతగా ఉద్యమించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. వార్తల్లో నేడు వివాదగ్రస్తమై ప్రధాన చర్చనీయాంశంగా మారిన మంచిర్యాల జిల్లా కోయపోషగూడెం నుండి ఈ నెల పదవ తేదీన…

మొన్న తీర్మానించింది.. నిన్న యాక్షన్‌ ‌చేపట్టింది

దక్షిణాది రాష్ట్రాలన్ని తమ ఆధిపత్యం కిందకు వొచ్చేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిన్నగాక మొన్న తీర్మానించిన భారతీయ జనతాపార్టీ కేంద్ర కమిటి అందుకు అనుగుణంగా నిన్నటినుండే పావులు కదపడం ప్రారంభించిందనడానికి రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థుల తీరే చెబుతున్నది. ఉత్తర, ఈశాన్య, పశ్చిమ రాష్ట్ల్రా ఒక వెలుగు వెలుగుతున్న బిజెపికి కొంతకాలంగా దక్షిణాది విషయంలో నిద్రపట్టడంలేదు.…

కాకతీయ ఉత్సవ సప్తాహం

మరోసారి కాకతీయ ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబవుతున్నది. నేటి నుండి ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాల యంత్రాంగమంతా సిద్దమయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ‘కాకతీయ ఉత్సవా లంటూ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నది ఈ సంవత్సరమే. సరిగ్గా పదేళ్ళ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి.…

మోదీ నోట తెలంగాణ విశిష్టత ..!

భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరుగుతాయన్న వార్త వొచ్చినప్పటినుండి రాష్ట్ర రాజకీయాలు వేడి పుంజుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ కూడా వొస్తుండడంతో రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చోటుచేసుకున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో…