Category ఎడిటోరియల్

ఆశావాహుల్లో ఆందోళన

మరో ఏడాదిలో రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టిఆర్‌ఎస్‌ ‌నాయకుల్లో ఆప్పుడే ఆందోళన మొదలైయింది. ఎన్నో ఆశలతో పార్టీలో కొనసాగుతున్న తమకు ఈసారికూడా టికట్‌ ‌లభించే అవకాశాలులేవన్న సంకేతాలు వెలువడడంతో ఇంకా ఈ పార్టీలో కొనసాగాలా లేదా పార్టీ మారాలా అన్న మీమాంసలో వారు పడిపోయారు. వివిధ పార్టీలనుండి అనేక మంది నాయకులు టిఆర్‌ఎస్‌లో…

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వేలెత్తి చూపిస్తున్న అరవింద్‌ ‌లొల్లి

టిఆర్‌ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్‌ ఎం‌పి ధర్మపురి అరవింద్‌ ‌లొల్లి కాస్తా టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలవైపు వేలెత్తి చూపుతోంది. గత రెండు రోజులుగా ఇరువురి మధ్య తీవ్రస్ధాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఇరువురుకూడా తమ హద్దులు దాటి విమర్శించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయా)ను వేడి పుట్టిస్తున్నాయి. ఇరువురి మధ్య కొనసాగుతున్న విమర్శనాస్త్రాల్లో మరికొన్ని కొత్త అంశాలు…

పాతవారికే టికెట్‌…‌ మరి ఎర్ర గులాబీల సంగతేంటి

రానున్న శాసనసభ ఎన్నికలపై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో అతికష్టంగా విజయం సాధించడంతో ఇక కెసిఆర్‌ ‌ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతాడని రాజకీయ పార్టీలు ఊహాగానాలు ప్రారంభించాయి. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా పార్టీ ఎల్‌పి సమావేశంలో దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.…

కమలాన్ని చీపురుతో ఊడ్చేసే యత్నం

గుజరాత్‌లో కమలాన్ని చీపురుతో ఊడ్చేసే ప్రయత్నంలో ఆమ్‌ ఆద్మీ (ఆప్‌) ‌పార్టీ తీవ్రంగా కృషి చేస్తున్నది. రెండున్నర దశాబ్దాలకు పైగా ఇక్కడ అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతాపార్టీని గద్దె దింపాలని ఆప్‌తో పాటు కాంగ్రెస్‌కూడా విశ్వప్రయత్నం చేస్తోంది. దీంతో ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న బిజెపి ఇప్పుడు గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి వొస్తున్నది.…

ఆరోగ్య తెలంగాణా..!

తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఆవిష్కతం అయ్యింది. వైద్య రంగంలో నూతన విప్లవం తీసుకుని వచ్చిన ఘనత కెసిఆర్‌దే. ఇప్పటికే వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా హాస్పిటల్స్ ‌తీర్చిదిద్ది సౌకర్యాలను కల్పిస్తూ వొస్తున్న ప్రభుత్వం ఏకంగా ఎనిమిది కాలేజీలకు జీవం పోసింది. ప్రతి ప్రభుత్వదవాఖానాలో పరీక్షలన్నీ జరిగేలా అధునాతన మిషినరీని ఏర్పాటు చేశారు. అధునాతన…

నేడు టిఆర్‌ఎస్‌ఎల్పీ మేధో మథనం

నేడు టిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎంఎల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులు విధిగా హాజరు కావాలని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలుస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో త్వరితగతిన జరుగుతున్న అనేక మార్పుల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు.…

మోదీ పర్యటనపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు

దేశ ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పర్యటనపై ఉభయ రాష్ట్రాల్లోకూడా నిరసన గళం వినిపించేందుకు స్థానిక ప్రజలు సిద్ధమవుతున్నారు.. రాష్ట్రాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాన్ని నిరసిస్తూ ఆయన రాక పట్ల తీవ్ర నిరసనను వ్యక్తం చేయాలని వారు సిద్ధమవుతున్నారు.. స్వదేశీ అంటూ అధికారంలోకి…

నిన్నటివరకు మునుగోడు – నేడు ప్రోటోకాల్‌ ‌వివాదం

మునుగోడు వివాదం ఇంకా చల్లారనేలేదు. ఇప్పుడు బిజెపి, టిఆర్‌ఎస్‌ల మద్య మరో వివాదం చోటుచేసుకుంది. అది పార్టీల మధ్య నే కాకుండా ఇప్పుడు ప్రభుత్వాల మధ్య వ్యవహారంగా మారింది. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. అదే ఇప్పుడు వివాదగ్రస్తమవుతున్నది. మోదీ రాక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించే విషయంలో కావాలనే…

మును‘గోడు’ పరిష్కార దిశగా..

మునుగోడు లో నెల రోజులకు పైగా జరిగిన యుద్ధం ముగిసింది. అనుకున్నంతగా కాకపోయినా అధికార పార్టీ ఈ పోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ ఎన్నిక ప్రచార కార్యక్రమంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తికి మించి అనేక వాగ్ధానాలు చేశాయి. వారిలో ముఖ్యంగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు…