Category ఎడిటోరియల్

భారత్‌ ‌జోడో యాత్రకు తెలంగాణ ‘ప్రజాతంత్ర’ స్వాగతం…!

ఈ నెల 23, ఆదివారం పొద్దున్న కృష్ణా నది వంతెనపై పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి తెలంగాణలో అడుగు పెట్టిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత ఈ రోజు తిరిగి ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా మఖ్తల్‌ ‌నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ సమాజం యాత్రకు స్వాగతం పలుకుతుంది.…

మూడు పార్టీలకు ముఖ్యం…‘మునుగోడు’

మునుగోడు భవితవ్యం మరో పది రోజుల్లో తేలనుంది. ఈ నియోజకవర్గంలోని దాదాపు రెండున్నర లక్షల మంది వోటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది వొచ్చే నెల మూడవ తేదీన తేలనుంది. ఇక్కడ నలభై ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం ప్రధానంగా మూడు పార్టీల మధ్యే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని వోటర్లలో…

మునుగోడులో మారుతున్న సమీకరణాలు ..

మరో పదిరోజుల్లో జరుగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో సమీకరణాలు,విజయావకాశాలు రోజు రోజు కు మారుతున్నాయి.. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన సీనియర్‌ ‌నాయకుడు వెలిబుచ్చిన అభిప్రాయం నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న మునుగోడు ఎన్నిక సందర్భంగా ఆ పార్టీకి గొడ్డలి పెట్టుగా మారింది. రోగి చనిపోయేవరకు ఏం ఫరవాలేదని డాక్టర్లు ధైర్యం చెబుతారు. అలాగే ఏ రాజకీయ…

తెలంగాణ వ్యవసాయ పథకాల అమలుకు పెరుగుతున్న డిమాండ్‌

‌తెలంగాణలో అమలవుతున్న పథకాలపై ప్రతిపక్ష పార్టీల్లో అభిప్రాయభేదాలున్నప్పటికీ పక్క రాష్ట్ర ప్రజల్లో మాత్రం క్రమేణ ఆ పథకాలపైన మోజు పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది. ఆ పథకాలను తమ రాష్ట్రంలోకూడా అమలు చేయాలని కొన్ని రాష్ట్రాల్లోని ప్రజలు కోరుతున్నారు. కాని పక్షంలో తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్‌ ‌కూడా చేస్తున్నారు. తాజాగా ఒడిశాలో ఇలాంటి డిమాండ్‌ ‌మొదలైంది.…

కోట్ల రూపాయలు మంచినీళ్ళ ప్రాయం

గెలుపే ధ్యేయం..అందుకు ఎంతవరకైనా సరే.. ఇది నేటి పోలిటికల్‌ ‌పార్టీల తీరు. వోటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ కాలంలో రాజకీయ పార్టీలు ఎంతకైనా దిగజారడానికి సిద్దపడుతున్నాయి. ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఒక పక్రియ. ఎవరు పాలనకు అర్హున్నది వోటర్లే నిర్ణయిస్తారు. అలాంటి వోటు హక్కు నేడు అపహాస్యం పాలవుతున్నది. పవిత్రమైన వోటు హక్కు ప్రలోభాలపాలవుతున్నది. దీంతో…

బిఆర్‌ఎస్‌ – ‌బిజెపికి ప్రత్యమ్నాయం అవుతుందా ?

Bharat Rastra Samithi భారత్‌ ‌రాష్ట్ర సమితి (బిఆర్‌సి) కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ(బిజపి)కి ప్రత్యామ్నాయం అవుతుందా అన్నదిప్పుడు కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు ప్రధాన చర్చనీయాంశమైంది. అనేక దశాబ్ధాల తర్వాత కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బిజెపి, ఎన్‌డిఏ కూటమితో వేళ్ళూనుకుని ఉండగా, దాన్ని కొత్తగా నిన్న అంటే బుధవారం దసరా సందర్భంగా ఏర్పడిన భారత్‌ ‌రాష్ట్ర…

క్షణానికోపేరు.. కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి ఎంపికలో అనేక మలుపులు

ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌కమిటి అధ్యక్ష అభ్యర్థి విషయంలో చివరి రోజున అనేక మలుపులు తిరిగి చివరకు ఇద్దరు నామినేషన్‌తో గడచిన మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడినట్లైంది. వీరిద్దరు కూడా వారివారి మద్దతుదారులతో శుక్రవారం ఎన్నికల అధికారికి నామినేషన్‌ ‌పత్రాలను అందజేశారు. అధ్యక్షుడి ఎన్నిక  విషయంలో జరిగిన అనేక పరిణామాలకు కారణమైన అశోక్‌ ‌గెల్లోతు…

సంక్షోభం ముగిసింది ..సందేహం వీడలేదు

కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక విషయంలో గడచిన రెండు మూడు రోజులుగా ఆ పార్టీలో తలెత్తిన సంక్షోభ పరిస్థితి గురువారం సాయంత్రానికి కాస్త చల్లబడింది. అంతమాత్రాన ఉపద్రవం తప్పిందనుకోవడానికి వీలులేదు. కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక మొత్తం కాంగ్రెస్‌ ‌పార్టీనే కుదిపేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఎప్పుడైతే రాహుల్‌ ‌గాంధీ తనకు ఆ పదవి…

బయ్యారం ‘ఉక్కు’ సంకల్పం

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం వైఖరిలో ఏమాత్రం మార్పులేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కేంద్రం ఇచ్చిన విభజన హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడంకూడా ఒకటి. గడచిన ఎనిమిదేళ్ళుగా ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక దఫాలుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం దిల్లీ కి వెళ్ళినప్పుడు,…