డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్ నిరుద్యోగాన్ని తగ్గిస్తుందా ?
ఒక పక్క రోజురోజుకు దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువవుతుంటే, ఉపాధి అవకాశాలను కలిగించే అక్షయ పాత్రలాంటి ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నది. దీని వల్ల యువత ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత ఏప్రిల్‌లో ఓ ప్రైవేటు సంస్థ సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగ శాతం7.83 ఉన్నట్లు తెలుస్తున్నది.…

