Category ఎడిటోరియల్

అమిత్‌ ‌షా ముస్లిం విద్వేష ప్రసంగం

రానున్న ఎన్నికలకు  తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణమే కనిపిస్తున్నది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదాలు, సవాళ్ళు, దేవుళ్ళ మీద ప్రమాణాలతో రోజుకో అంశం రగులుతోంది. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్‌లు ఏదో అంశంపైన అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీని నగ్నంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌…

‌హ్యాట్రిక్‌ ‌దిశగా అడుగులు..

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌ ) ‌రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్‌ ‌కొట్టడం ద్వారా సరికొత్త రికార్డును సాధించాలన్న పట్టుదలతో ఉంది. భారత దేశంలో ఇటీవల కాలంలో మూడవ సారి ముఖ్యమంత్రి అయిన వారు అరుదు కావడంతో ఎలాగైనా మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కెసిఆర్‌ ‌వ్యూహరచన చేస్తున్నారు.  ప్రత్యేక రాష్ట్ర సాధనా )క్ష్యంగా 2001లో టిఆర్‌ఎస్‌ను స్థాపించిన…

తెలంగాణ లక్ష్యంగా అమిత్‌ ‌షా పర్యటన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా తెలంగాణ పర్యటనకు ఈ నెల 23వ తేదీని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన  ఏర్పాట్లను గత వారంరోజులుగా కొనసాగిస్తున్నది. దాదాపు పదిహేను రోజుల కిందనే ప్రధాని నరేంద్రమోదీ వొచ్చివెళ్ళగా, ఇప్పుడు షా పర్యటనతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉరకలు వేయిస్తున్నది. గతంలోకన్నా ఈసారి…

శృతి మించుతున్న ఏపీ, తెలంగాణ మంత్రుల మాటలు

తెలంగాణ, ఏపీ మంత్రుల మాటలు శృతి మించుతున్నాయి. తోటి మంత్రులన్న కనీస మర్యాదను కూడా విస్మరిస్తున్నట్లుగా నోటికి ఎంతవస్తే అంతే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన కామెంట్‌కు ఏపీ మంత్రులకు నషాళానికి ఎక్కినట్లు కనిపిస్తున్నదనేందుకు వారిచ్చే  ప్రతిస్పందన తీరు చెప్పకనే చెబుతున్నది. విమర్శలను మంత్రులు తమ వరకే పరిమితం చేయకుండా రాష్ట్ర ప్రజలను…

ఉమ్మడి రాజధాని ఒప్పందం ముగిసే దశలో మళ్ళీ హైదరాబాద్‌పై చర్చ

ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు జరిగిన ఒడంబడిక ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళపాటు కొనసాగుతుంది. ఆ ఒప్పందం 2024 నాటికి ముగియనుండగా మరోసారి హైదరాబాద్‌ ‌విషయంలో చర్చ పునారావృతం అవుతున్నది. పద్నాలుగేళ్ళ తెలంగాణ ఉద్యమకాలంలో ఈ విషయం రాజకీయ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల మధ్య తీవ్రంగా నలిగిన విషయం తెలియంది కాదు.…

కీలక నేతలను కోల్పోతున్న కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ ‌పార్టీ ఒక్కరొక్కరుగా కీలక నేతలందరినీ వరుసగా కోల్పోతున్నది. వొచ్చే ఎన్నికలనాటికి అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే దిశగా ఆలోచన చేస్తున్న క్రమంలోనే పార్టీకి వీరవిధేయులుగా ఉన్నవారంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. పార్టీని వీడుతున్న క్రమంలో జాతీయ స్థాయినాయకులు సోనియా గాంధీని, రాహుల్‌ ‌గాంధీని టార్గెట్‌ ‌చేసి విమర్శనాస్త్రాలను సంధించి, తెలంగాణ…

ఒక నిర్ణయం వెనుక అనేక వ్యూహాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తీసుకున్న ఒక నిర్ణయం అనేక మంది మెదళ్ళకు పదును పెడుతున్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో మాయల మరాఠీగా లభించిన పేరును ఆయన శాశ్వతం  చేసుకుంటున్నారు. ఏ క్షణాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. ఆయన తీసుకునే నిర్ణయాలు బహుచర్చనీయాంశంగా తయారవుతాయనడానికి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న…

‌రాష్ట్ర రాజకీయాలపై ఖమ్మం ప్రభావం చూపనుందా ..?

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల సస్పెన్షన్‌ద్వారా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గడ్డుస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్తితులు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు ముఖద్వారంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు  మరింత దూరమయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమకాలంనుండి నిన్న మొన్నటివరకు రాష్ట్రమంతటా అన్నిజిల్లాల్లో మెజార్టీస్థానాలు సంపాదించినా,…

జంగ్‌ ‌సైరన్‌ ‌మోగించిన మోదీ

అంతా అనుకున్నట్లే అయింది. ప్రధాని నరేంద్రమోదీ రాకతో తెలంగాణలో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఇంతకు క్రితం నాలుగుసార్లు మోదీ తెలంగాణలో పర్యటించినా బిఆర్‌ఎస్‌ ‌పార్టీపై విమర్శనాస్త్రాలను సంధించడంతోనే పరిమితమైంది. కాని, శనివారం నాడు ఆయన బిఆర్‌ఎస్‌పైన యుద్ధ భేరీని మోగించినట్లు స్పష్టమవుతున్నది. ఇప్పటివరకు బిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీల మధ్య సాగుతున్న యుద్ధమల్లా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర సంబంధా…