Category ముఖ్యాంశాలు

మ‌హిళ‌ల ప్ర‌గ‌తే స‌మాజ ప్ర‌గ‌తి – మంత్రి సీత‌క్క‌

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే సంకల్పంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్న‌ద‌ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం హైద‌రాబాద్‌లోని ఇందిరా మహిళా శక్తి బజార్ ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులను ఉద్దేశించి ఆమె ప్ర‌సంగించారు. మహిళా సంఘాల ద్వారా…

కాళేశ్వ‌రాన్ని ఎండ‌బెట్టి రైతుల‌కు ద్రోహం

-కాళేశ్వ‌రం కూలితే హైద‌రాబాద్‌కు నీళ్లెట్ల తెస్తారు? – వంద‌శాతం రుణ‌మాఫీ జ‌రిగిందంటే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా – జ‌స్టిస్ ఘోష్ క‌మిష‌న్ గడువెందుకు పెంచాల్సి వ‌చ్చింది? – ఇచ్చింది చారానా…బిల్డ‌ప్ బారానా – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. సెటైర్లు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టి రైతాంగాన్ని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర…

త్వ‌ర‌లో స‌ర్వేయ‌ర్ల నియామ‌కాలు

– 26 నుంచి శిక్ష‌ణ‌ – ప్ర‌తి మండ‌లానికి 6 నుంచి 8 మంది – భూ విస్తీర్ణం, లావాదేవీలను బ‌ట్టి స‌ర్వేయ‌ర్ల నియామ‌కం – న‌క్షా లేని గ్రామాల్లో గ్రామ‌స‌భ‌లు పూర్తి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో భూస‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌క్ష్యంగా లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల నియామ‌కం చేప‌డుతున్నామ‌ని రాష్ట్ర…

ఘోష్‌ ‌కమిషన్‌ ముందు కెసిఆర్‌ ‌హాజరవుతారా ?

( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) జస్టీస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ముందు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరవుతారా లేదా అన్నదిప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అనేక అవతవకలపై సుప్రీంకోర్టు మాజీ జస్టీస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిటి గత ఏడాదిన్నరగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో…

బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా వుండాలి

– 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలి –  రాజీవ్ యువ వికాస పథకానికి రూ. 6,250 కోట్లు సబ్సిడీ -రూ.21వేల కోట్ల రైతు రుణ‌మాఫీ మొత్తం బ్యాంకుల్లో జ‌మ‌ – ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కాబట్టి బ్యాంకింగ్…

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం 

అధికార్ల‌ను ఆదేశించిన ప్ర‌భుత్వ సి.ఎస్‌. కె. రామ‌కృష్ణారావు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను సిఎస్ ఆదేశించారు. ఈ వేడుకలకు కావలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణా రావు గురువారం డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో  ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్‌…

అవినీతిని క‌ప్పిపుచ్చుకోవ‌డానికే కె.సి.ఆర్‌.కు నోటీసులు

– ఇది ప్ర‌జాపాల‌న కాదు ప‌ర్సంటేజీల పాల‌న‌ – క‌మిష‌న్లు ఇవ్వ‌క‌పోతే ప‌నిజ‌ర‌గ‌దు -హామీలు తీర్చ‌లేక చ‌తికిల‌బ‌డిన ప్ర‌భుత్వం –  మీడియాతో కేటీఆర్ 17 నెలలుగా పాలన చేతకాక, ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలో తెలియక, తమ కమిషన్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాళేశ్వరం కమిషన్ తో కేసీఆర్‌కు నోటీసులు జారీచేశార‌ని…

ఆర్థికంగా తెలంగాణ అద్భుత విజ‌యం

– ఇది కె.సి.ఆర్‌. ఘ‌న‌తే -మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 21:స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఐసీఆర్ఏ ‘స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్ – మే 2025’ నివేదిక వెల్లడించిన సంగ‌తిని ఆయ‌న గుర్తుచేశారు.  తలసరి ఆదాయం ₹1.25 లక్షల నుంచి ₹3.5 లక్షలకు రెట్టింపు కాగా, 6.8%…

విలువ‌ల‌తో కూడిన విద్య అవ‌స‌రం

– ప్రైవేటు స్కూళ్ల విద్యార్థుల‌తో పోటీ ప‌డుతున్న ఎస్టీ విద్యార్థులు – అక్ష‌రాస్య‌త ద‌శ‌నుంచి ర్యాంకుల స్థాయికి ఎదిగాం – స‌మాన‌త్వాన్ని తెచ్చేది విద్య‌మాత్ర‌మే -డిమాండ్ ఉన్న కోర్సుల‌పై టీచ‌ర్లు విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి -మంత్రి సీతక్క ఇతర విద్యార్థుల కన్నా గిరిజన విద్యా సంస్థల విద్యార్థులకు మంచి మార్కులు వచ్చేలా పనిచేసిన టీచర్లకు పంచాయతీరాజ్…