Category ముఖ్యాంశాలు

అందరికీ రోల్‌మోడల్‌గా నిలవాలి

ఏఎంవీఐల పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌లో మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందిన 96మంది అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ (ఏఎంవీఐ) పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌ బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంవీఐ నుంచి…

సీఎఫ్‌వోల పాత్ర కీలకం

సీఐఐ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆధునికత, అభ్యుదయానికి కేంద్రమని, సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్రతలు రాష్ట్ర విధానాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) బుధవారం సోమాజిగూడలో నిర్వహించిన చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్ల(సీఎఫ్‌వో)…

నదిపై కుప్పకూలిన బ్రిడ్జి: 9మంది మృతి

గుజరాత్‌ వడోదరా జిల్లాలో ఘటన గుజరాత్‌: వడోదర జిల్లాలోని మహిసాగర్‌ నదిపై ఉన్న గంభీరా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిన ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోగా తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రెండు…

ఆ 8మంది ఆచూకీ కష్టమే

వారు చనిపోయి ఉండొచ్చు ఇళ్లకు వెళ్లాలని వారి కుటుంబాలకు అధికారుల సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ఆచూకీ లభించని ఎనిమిదిమంది కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం ఆశలు వదులుకుంది. ఇక ఎనిమిదిమంది కార్మికుల ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చివేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అడిషనల్‌…

తెలంగాణ రైతుల డిమాండ్‌ను నెరవేర్చండి

అధికారులకు కేంద్ర మంత్రి నడ్డా ఆదేశాలు యూరియా కోటా పెంచాలన్న సీఎం విజ్ఞప్తికి స్పందన దిల్లీ, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణకు దేశీయ యూరియా కోటా పెంచాలన్న సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నామని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రైతుల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా అధికారులకు…

ఎవరినీ ఉపేక్షించేది లేదు

కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: కూకట్‌పల్లి పరిధిలో కల్తీ కల్లు తాగిన కారణంగా ముగ్గురు మృతిచెందిన సంఘటనపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్‌ అయ్యారు. ఈ సంఘటనలో 19మంది తీవ్ర అస్వస్థతకు గురవగా చికిత్స పొందుతూ వారిలో ముగ్గురు మృతిచెందారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ…

రైల్‌రోకో ట్రైలర్‌ మాత్రమే

42శాతం బిసి రిజర్వేషన్లపై కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8:  స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా…

ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీకి సహకరించండి

– వరంగల్‌ విమానాశ్రయానికి ఆర్థిక సహాయం చేయండి – హైదరాబాద్‌-బెంగళూరు ఏరో-డిఫెన్స్‌ కారిడార్‌ మంజూరు చేయండి – కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, జులై 8: జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌…

దేశీయ యూరియా కోటా పెంచండి

– కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, జులై 8: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని దిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం…