Category శీర్షికలు

వలస.. నా రచనల ఊపిరి

ప్రవాస తెలంగాణం వలస అనేది నాకు జరిగిన ఒక పెద్ద మానసిక సంక్షోభం. పుట్టిపెరిగిన ప్రాంతాన్ని, కుటుంబాన్ని వదిలి మరొక దేశానికి వెళ్లడం అనేది పైకి చూడటానికి సాధారణంగానే కనిపించవచ్చు, కానీ ఈ ప్రక్రియలో ఒక మనిషి తనలోతాను ఎన్నో అంతర్గత సంఘర్షణలకు గురవుతాడు. బహుశా, ఆ సంఘర్షణే నాలో ఉన్న రచయితను తట్టిలేపింది. గల్ఫ్…

హీరోయిక్

మెరుపు తీగెలు హీరోయిన్‌కు సంగీతమే ప్రపంచం. తనకిష్టమైన వయోలిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో సీటు సంపాదించింది. కాని ఆ అమ్మాయి తండ్రి పెళ్ళి చెయ్యాలని నిర్ణయించాడు. హీరోయిన్ చదువు పూర్తిచేశాక పెళ్ళిచేసుకుంటానని తండ్రికి మాట యిచ్చి హైదరాబాదు వచ్చింది. హీరోకు సౌండ్ అంటే అలర్జీ. చిన్న సౌండ్ వచ్చినా భూకంపం వచ్చినట్టు ఫీలవుతాడు. సౌండ్ రాని యింజను…

అజడ చేతనం

నాలో గడ్డకట్టిన సముద్రాలు ఆవిరి అవుతున్న ఇనుప కోటలు కరిగి ప్రవహిస్తున్న పర్వతాలు శిలాజీకరణం చెందిన అడవులు ఎన్నో ఉన్నాయి. నాలో మౌనం వెనుక దాగిన ఆగ్రహం హాహాకారంలో మరుగున పడ్డ నివేదనం నిశ్చలతలో నిక్షిప్తమైన దిక్కారం ఆవేశం అడుగున మమకారం నివురుగప్పి ఉంది. ఓ మనిషీ! “హాల్ కైసా హై జనాబ్ కా, క్యా…

కనువిప్పు కావాలి

దక్షిణ భారతంలో తెలుగుప్రజలు మాత్రమే రెండురాష్ట్రాలుగా విడిపోయారు. ఈ క్రమంలో రెండురాష్ట్రాల ప్రజలమధ్య ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి, ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో సృజనాత్మకరంగానికి చెందిన కవులు, రచయితలు, కళాకారులు కీలకమైనపాత్ర పోషించటం శోచనీయం. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిన ఛాయ లిటరరీ ఫెస్టివల్ కు ప్రాంతీయత పరమార్థం కాకూడదు. ఆధిపత్యభావనలకు అతీతంగా…

పరస్పరం ప్రభావితం చేస్తాయి

ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ జరిపే దక్షిణాది సాహిత్య, సాంస్కతిక సంబరం అవసరమైనది, అపురూపమైనది. సాహిత్యం వ్యక్తిగతం కాదు, సామూహిక, సామాజిక పరమైనది. సమూహంతో సాహిత్యకారుల కలయిక, సమావేశాలు ఇటు సాహిత్యకారుల్ని, అటు సమూహాల్ని పరస్పర ప్రభావితం చేస్తాయి. మరింత ఆశాజనకమైన, అభివృద్ధికరమైన సాహిత్య, సాంస్కృతిక ప్రయాణానికి ఉపకకరిస్తాయి. సరే, చర్చనీయ అంశాలు, గోష్టుల ఎంపికలో ఎప్పటికప్పుడు…

ఛాయా సాహిత్యోత్సవం

తొలి ఆధునిక సాహిత్యోత్సవంగా నిర్వాహకులు. సాహిత్యకారులు ప్రస్తావిస్తున్న ‘ఛాయా లిటరరీ ఫెస్టివల్’ 25-10-2025 న హైదరాబాద్ లో జరుగనుంది. డా. బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదికగా జరిగే ఈ సాహిత్య, సాంస్కృతిక ఉత్సవం- దక్షిణ భారత భాషల సమ్మేళనం. ఈ సందర్భంగా ప్రజాతంత్ర దినపత్రిక సాహిత్య పేజీ ‘శోభ’ రెండు తెలుగు రాష్త్రాల…

కొత్త బిచ్చగాడు

అమ్మా! మాదా కబళము లేదు పోరా! అమ్మా! ఆకలి తల్లే చెబుతుంటే నీక్కాదూ కసురుకున్న విసుగు శబ్దం ఆకలిక్కూడా సిగ్గయి తలవంచుకొని వెనుదిరిగి పోయింది కానీ ఈ కొత్త ఆకలికి సిగ్గూ శరమూ లేదే తను ఆశ్రయించిన బిచ్చగాన్ని పదే పదే రెచ్చగొడుతుంది నిస్సిగ్గుగా జోలె చాపి మరీ మరీ దేబిరిస్తుతుంది ఎన్నో నెత్తురుటేర్లకు ప్రత్యక్షంగానో…

వొక బసవేశుని కథ

 మెరుపు తీగెలు  దానికి యెద్దూ తెలీదు, పొద్దూ తెలీదు. ఎందుకంటే అది యెద్దు! వీడేమో మనిషి. వీడికి యెద్దూ తెలుసు. పొద్దూ తెలుసు. పొద్దు కింద పంటా తెలుసు. ఈ పంట నాది, ఆ పంట నీది అని తెలుసు. తనది తెలుసు. పరాయిది తెలుసు. వాటి మధ్య భేదమూ తెలుసు. ఎటొచ్చీ యెద్దుకే తెలీదు.…

దళితుల భరోసా బావుటా

డా. కల్లూరి ఆనందరావు గారి లేఖిని నుంచి వెలువడిన “ఆలోకనమ్” సాహితీ వ్యాసావళిలో మొత్తం 24 వ్యాసాలు ఉన్నాయి. ఇందులో  అర్థభాగం ఇనాక్ గారి సాహిత్యం వ్యక్తిత్వానికి సంబంధించినవి. ఇనాక్ సాహిత్య పరిశోధకులకు దళిత సాహిత్య అధ్యయన పరిశోధకులకి ఈ పుస్తకం ఉపకరిస్తుంది, ఈ పుస్తకంలో సగభాగం దళిత సాహిత్యానికి సంబంధించిన అనేక ప్రామాణిక విషయాలు…