Category శీర్షికలు

గాలి కథ

మెరుపు తీగెలు   “దెయ్యం దెయ్యం… నువ్వున్నావా?”           “ఉన్నాను, లేకపోతే నువ్వెందుకు నన్నడుగుతావ్?”           “దెయ్యాలు లేవంటారు కొందరు…”           “లేనోళ్లకి లేవ్…”           “దెయ్యాలు వున్నాయంటారు కొందరు…”           “ఉన్నోళ్లకి వున్నాయ్…”           “అసలు నువ్వు వున్నావో లేవో సరిగ్గా చెప్పు”           “నాక్కూడా తెలీదు…”           “దేవుడు వున్నట్టయితే దెయ్యమూ వున్నట్టే…

కోరిక మాట తప్పదు

ఎప్పటికీ మాట తప్పదు నా కోరిక ఎంత దూరంలో ఉన్నా పాతకాలం నాటి ఏ ఇష్టాన్ని గాయపరచుకోదు ఎద తలుపు తట్టి పిలవాలే గాని బదులు పలికేందుకు ఏ లోతుకు అలసటుండదు ఎదుటపడి ఏరుకునే ఆలోచన ఉండాలేగానీ ఏ అర్ధం అడ్డుగోడకాలేదు ఒక్కో క్షణం ఒక్కో కోరికలా గతాన్ని చదివించి భవిష్యత్తుని బోధిస్తుంది -చందలూరి నారాయణరావు

గుండెను ఇంటి చూరుకి వేలాడదీసి…

ప్రవాస తెలంగానం కన్నోళ్లను, ఐనోళ్లను, పుట్టి పెరిగిన ఊరిని, అన్నిటినీ వదిలి వలస వెళ్లడమంటే నాదృష్టిలో గుండెను ఇంటి చూరుకు వేలాడదీసి ఒట్టి దేహంతో పొలిమేరను దాటడంలాంటిది. అలా నేను ఊరు విడిచి ఇప్పటికి పన్నెండు వసంతాలు. ఈ పుష్కరకాలంలో మస్కట్ నుంచి మాస్కో వరకూ, మండే ఎండల్లోంచి మంచు కొండలదాకా, రియాల్ కూ రూబెల్…

అల్లిక జిగిబిగి

చేపల వేట నక్కలు గద్దెలపై జ్ఞానంపై దాడి శ్రమ దోపిడి కర్మకష్టాల ఊబి కార్మికసమ్మె ఆమె పాఠాలు విప్లవ సిద్ధాంతాలు అమ్మ నవల జీవన వైనం పండుగ ఆనందాలు దక్షిణాయనం మూడాసులాట రొక్కం ముక్తికి చోటు ఊచల బాట -రేడియమ్

వాళ్ళ గుండెల్లో మంట ఉంది

కాళ్ళూ రెక్కలూ లేని తరం మొలిచిందని కలతపడ్డా కన్నీటి పొరలు ఒక్కొక్కటీ ఆవిరవుతున్నాయి అలా గాలిలో తేలుతున్న ఒక చిన్న నినాదం వేసవి రోడ్ల పొగమంచులో నిన్నటి జ్ఞాపకంలా వినిపించింది ఆ నినాదం ఎవరిదీ ఎవరి కోసం ఎందుకోసం దేనికోసం ఆ చిన్న నినాదం విన్నప్పుడు తెలియలేదు కానీ ఏదో ఒకమార్పు చిన్నగా గుండెల్లో కొట్టుకుంది. ఇన్నాళ్లకి నేను మళ్ళీ…

పూల బోగం!

మెరుపు తీగెలు పువ్వులు కొమ్మనుండి వేరుపడ్డామని కుమిలిపోలేదు! దేవుని శిరస్సెక్కి కూర్చున్నామని ఆనంద పడిపోలేదు! దండలో గుచ్చిన పువ్వులు నొప్పిని మర్చిపోయి దేవుని దేహం మీద దొర్లాడాయి! అందుకు దారానికి కృతజ్ఞత చెప్పుకోకపోయినా దేవునికి కృతజ్ఞత చెప్పుకున్నాయి! సూది దిగలేదని దారం తమని అదుపు చెయ్యని విడివిడి పువ్వులు విచ్చలవిడిగా దేవుని శిరసుమీదా తామే సిరిపాదంమీదా…

ఇహం

ఇవిగో రాలిపడ్డ ఆకులపై కాలం వేసిన వేలిముద్రలు కేలండర్ తీగపై ఆరబెట్టిన అంకెల్లా తేదీలు జీవితం నమిలి ఉమ్మేసిన నిమిషాలు, గంటలు ఇవిగివిగో కాలదోషంలేని కథలు చెప్పే రాతి సాలభంజికలు ఎప్పటికీ ఎండని రాజుగారి ఏడు చేపలు ఇంకుడుగుంతల్లో ఇతిహాసపు ఇసుకరేణువులు ఇదిగో ఇదిగిదిగో లౌల్య లోలకపు మాయలో చిక్కుకున్న భ్రమాస్పదులు మైనపు రెక్కలతో ఎగిరే…

ఊరికెనే వుండిపోయా

ఆకులు వాలిపోగా కొమ్మలు పుల్లలౌతుంటే పూలిక రావని తెలిసినా ఊరికెనే ఉండిపోయా ఆకాశం వాగ్ధానం యిచ్చి,  తప్పినా వాన రానందుకు చెరువు కాలువలో పారనందుకు ఊరికెనే వుండిపోయా విత్తనాల, మందుల మల్టీనేషనల్ మర్మం తెలిసినా పంట పెట్టుబడి రాబడి నిష్పత్తి వైరం అనుభవించినా నాగలి ధర్మంతో నడవక తప్పదనీ ఊరికెనే వుండిపోయా ఐదేళ్ళ కొకసారి బతికున్నట్లు ఓటు…

శిథిలమైన శరీరాన్ని దారంతో కుట్టుకోండి

ఇప్పడు నువ్వు ఒక నిషేధాన్ని నిషేధించాల్సి ఉంది ఇప్పడు నువ్వు నీ అస్థిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంది అడవిలో  కోవర్ట్ ఆపరేషన్లతో రాజ్యం హత్యలు చేస్తూ ఆదివాసి గూడెలల్లో యుద్ధ విమానాలతో బాంబులు వర్షం కురిపించిన సరే నీ ఉనికిని ఆవిష్కరించుకోవాల్సి ఉంది శత్రువును ఎదిరించడమే నీ ధ్యేయమైనప్పుడు ఏ మార్గాన్ననుసరిస్తేనేం? శత్రుశేషం నీ ఆశేషత్యానికి దారి…