నానీల్లో మాండలిక పద పరిమళం…
తెలంగాణ భాషను, యాసను పుక్కిట పట్టి మాండలిక పదాలు, జాతీయాలపై ఎంతో పట్టుతో కవిత్వం రాసిన కవి అన్నవరం దేవేందర్. సులభంగా తెలంగాణ భాషా ప్రయోగాలను కవిత్వంలో కూర్చగలిగిన నిపుణత ఆయన రాసిన పలు రచనల్లో కన్పిస్తుంది. బుడ్డపర్కలు పేరిట నానీల సంకలనాన్ని దేవేందర్ వెలువరించారు. లోకంలోకి విసిరేసిన నిఖార్సైన వాస్తవాల అగ్నిగోళాల్లా బుడ్డపర్కలు కన్పిస్తాయి.…
