Category శీర్షికలు

‌ప్రజలే కాంగ్రెస్‌ ‌ను కాపాడుకోవాలి

 ‘‘పట్వారీ దొరగారు పరమాన్నం పెడుతుంటే పరమా త్ముడనుకున్న, ఆడుకొమ్మని ఆట బొమ్మిస్తే దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న, జాలితోటి జామ పండిచ్చి తలమీద చేయి పెడితే తండ్రి లెక్కనుకున్నా, వెండి గిన్నెల పాలు పోసిస్తే దండి గుణమని దండాలు పెట్టిన, కాటు వేసేదాకా తెలువదయ్యా కడుపులో విషమై అది పెరిగి పోయింది. గొరగాని బ్రతుకై పోయింది’’ 25…

దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్థ !

‘‘‌సమగ్రాభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే సాధ్యమని గుర్తించి ముందుకు సాగాలి. వ్యవసాయఅభివృద్దికి చర్యలు తీసుకోవాలి. విప్లవాత్మక చర్యలకు పూనుకోవాలి. అలాగే పాడి రంగాన్ని, కోళ్ల పరిశ్రమల అభివృద్ది తదితర రంగాలను ప్రోత్సహించాల్సి ఉంది. దేశంలో ఉత్పత్తి రంగాల్లో మాంద్యం పెరిగింది. పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడకేసింది. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి కల్పన…

దాల్‌ ‌మే కుచ్‌ ‌కాలా హై…!

ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి ప్రత్యేక స్థానముంది. అంతటి ఉన్నత దేశం అపహాస్యంపాలవుతుంటే చూస్తూ ఊరుకోవడం సమంజసంకాదు. ఈ విషయాన్ని ఎంతో భారమైన మనస్సుతో, దుఖంతో చెబుతున్నానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం రాత్రి చేసిన మీడియా ప్రసంగం ప్రజాస్వామ్యవాదులను ఆలోచింపజేసేదిగా ఉంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ దేశంలో నెలకొనిఉన్నాయి. ప్రజాస్వామ్య…

గడ్డి బెంబేలు

‌లంచం…అదో రోగం, సమాజానికి పట్టిన గ్రహచారం. ఎన్నిచట్టాలు వచ్చినా దానికి చుట్టాలే. ఆకలితో దేబురిస్తూ కంచం నిండితే చాలని ఘోషిస్తున్న జనులు కొందరైతే, లంచాలతో కడుపునింపుకోవాలని చూసే మరికొందరున్న నేటి సమాజంలో తాయిలాలతో,బుజ్జగింపు ఫీట్లతో రాజకీయం మకిలిపట్టిపోతోంది. స్వప్రయోజనాలు తప్ప ఏ జెండా అవసరంలేని రాజకీయాన్ని, డబ్బుపై వ్యామోహంతో గుడినీ,గుడిలో లింగాన్నీ దోచే మనస్తత్వం పుణికిపుచ్చుకొని…

ఆకాశంలో సంబరం

ఆకాశమంతా ఉల్కాపాతం మిలమిలా మెరిసిపోతూ గగనం నుండి  వెండితళుకుల హిమపాతం ధారగా కురిసిపోతూ! రోదశి యుద్ధంలో ఓడిన గ్రహాశకలాలన్నీ రాలిపోతూ చీకటి రాత్రిలో నింగినుండి భూగోళంపై క్షిపణుల్లా జారిపోతూ! శకునం చెప్పే తోకచుక్క కధనాలు, మబ్బులయుద్ధపు మెరుపు విశేషాలు, సిగపట్లకు రేగే ఉరుము ద్వానాలు అలసి సొలసి రాలిపోయే నక్షత్రాలు! కదిలి తరలిపోతున్న పాలపుంతలు, నీడభూతాలకు…

నానీల్లో మాండలిక పద పరిమళం…

తెలంగాణ భాషను, యాసను పుక్కిట పట్టి మాండలిక పదాలు, జాతీయాలపై ఎంతో  పట్టుతో కవిత్వం రాసిన కవి అన్నవరం దేవేందర్‌. ‌సులభంగా తెలంగాణ భాషా ప్రయోగాలను కవిత్వంలో కూర్చగలిగిన నిపుణత ఆయన రాసిన పలు రచనల్లో  కన్పిస్తుంది. బుడ్డపర్కలు పేరిట నానీల సంకలనాన్ని దేవేందర్‌ ‌వెలువరించారు. లోకంలోకి విసిరేసిన నిఖార్సైన వాస్తవాల అగ్నిగోళాల్లా బుడ్డపర్కలు కన్పిస్తాయి.…

కా.జార్జి రెడ్డి వారసత్వం కావాలిప్పుడు..

‘‘ఐదేళ్ళ పాటు ప్రభుత్వం మీద వీధి పోరాటాలు నిర్వహిస్తూ ఎన్నికల వేళ గెలిచే బూర్జూవ పార్టీల సంక చేరే పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీల అనుబంధం విద్యార్థి సంఘాలు తమ విద్యార్థులకు ఏ చైతన్యపు మార్గదర్శకాన్ని ఇస్తున్నాయో కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు.విప్లవ విద్యార్థి సంఘాలు ఏ మేరకు తమ పోరాటాలను విద్యార్థులలోకి తీసుకెళ్ళాయో సమీక్షించుకోవాలి. పాఠశాల…

‘ ఉప’ ద్రవం… !

ఎన్ని జాతరలు కలిస్తే ఈ ఎన్నికల జాతరను మరిపిస్తాయి? ఎన్ని రసాలు కలియబెడితే వచ్చిన సారమైనా ఇక్కడ పంచబడే ‘మధు’రసం వలె ఇంతలా ఏరులై పారుతుంది చెప్పండి? తేనెతుట్టెను కదిపినప్పుడు కందిరీగలు పైకి లేచినట్లు నోట్ల కట్టల పాములు కట్లు తెంచుకొని నియోజకవర్గమంతా పాకుతున్నాయి. ఉప’ద్రవాలు రాష్ట్రాన్ని వూరికే వదిలివేయడం లేదు.వాయుగుండం తుపానుగా మారి వర్ష…

యువశక్తే దేశ సంపద…

ఏ ‌దేశానికైనా యువతే భవిత. ఒక దేశ నిర్మాణానికీ, పురోగమనానికీ అవసరమైన కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సామాజికవేత్తలు, భావి నేతలూ యువతరం నుంచే రావాల్సి ఉంటుంది. జీవితంలో ఉత్సాహం, ఉత్తేజం ఉరకలు వేసే ఉజ్వలమైన దశ అది. ఏ దేశానికైనా యువశక్తే గొప్ప సంపద. ఈ కోణంలో చూసినప్పుడు ప్రపంచంలో భారతదేశం…