ఆకలి చుట్టూ అల్లుకున్న కళాత్మకత…
మట్టికుండ మన నాగరికతకు మూలం. చరిత్రను పట్టి ఇచ్చి గుట్టు విప్పిన గొప్ప ఆనవాలు కూడా అదే. ఆకలి తీర్చే అన్నాన్ని తీరుగా వండేందుకు తోడ్పడే కుండలను నిశితంగా చూస్తే బ్రహ్మాండమే దొరుకుతుందంటారు ప్రముఖ కవి అన్నవరం దేవేందర్. వండుక తినే బువ్వకుండ మూలాలను దీర్ఘ కవిత్వంగా రంగరించి చూపారు. మూడు వేల సంవత్సరాల కింద…
