Category శీర్షికలు

సమీరాలు

ప్రేమను కొలవడం విలువకట్టడం ఎలా సాధ్యం!? అది ఉద్వేగపు కెరటాల్తో ఉప్పొంగే కడలి అయినప్పుడు!….పేదరికపు తీరంలో ఆకలి తరంగాల్తో ఘోషిస్తూనేవుంది బానిసత్వపు సముద్రం- ఇక ఉద్యమ అల్పపీడనంతో తప్పదు నిరసన తుఫాను!…నీ మనసు అయితేనేం వొక నిశ్చలమేఘం- ఆశయాల పవనాల్తో అది అవుతుంది జీవనాధార ధారల్ని కురిపించే తొలకరి రాగం…    –  డాక్టర్ కొత్వాలు అమరేంద్ర…

కేన్స్‌ చిత్రోత్సవంలో తెలుగోడి ప్రతిభ!

బెస్ట్‌ డాక్యుమెంటరీ విభాగంలో ‘ఆస్కార్‌ చల్లగరిగ’కు అరుదైన ఘనత తెలుగోడి ప్రతిభకు కేన్స్‌ చిత్రోత్సవం మరోసారి జేజేలు పలికింది. వివరాల్లోకి వెళితే.. కేన్స్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారత్‌ నుంచి షార్ట్‌ లిస్ట్‌ అయిన చిత్రం ‘ఆస్కార్‌ చల్లగరిగ’.  ప్రముఖ తెలుగు సినీ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌పై రూపొందించిన ఈ  డాక్యుమెంటరీ  కేన్స్‌ చిత్రోత్సవంలో…

నేటికి వీడ్కోలు!

చిరునవ్వు రువ్విన రోజు నీటి బుడగలా రాలిపోతుంటే! వేడినిటూర్పుల ఒక్కక్షణం గాలిగుమ్మటంలా ఎగురుతోంది! గడచినక్షణాలను గణిస్తుంటే గడచిపోతున్నాయి యుగాలు! కసాయి కాలచక్రాలు కాస్తంత కూడా వెనక్కు జరగటం లేదు! కాలప్రవాహంలో కొట్టుకుపోయిన వసంతాలను! బ్రతుకుపుస్తక నందనంలో మిగిలిపోయిన మోడులను! విడిచిన నిట్టూర్పులను, చిందించిన నవ్వులను లెక్కవేస్తుంటే! కొత్త యేడు కంగారుగా కాళ్ళ దగ్గరకు వచ్చేసింది! రానున్న…

కొత్త సంవత్సర శుభాకాంక్షలు

పాతకు వీడ్కోలు కొత్తకు స్వాగతం హ్యాపి న్యూ ఇయర్… చీర్స్అటూ బీర్లు. చికెన్ హాయిరే అంటూ క్యాబరే డ్యాన్యులతో సంబరాలు జరుపుకునే పాలకుల పండుగ …! గతాన్ని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. నిర్బందాలు. నిషేదాలు. కూంబింగ్ ఆపరేషన్స్ రక్తపు టేరుల్లో పల్లె కమురు వాసనలో రాజ్య ప్రేరేపిత హంతక ముఠా స్వైర విహారంలో ప్రజాస్వామ్యం హత్య…

ఆకాశమంత ఆవేదన…

కవిత్వం ముందు / ఏదీ విలువైంది కాదు /వజ్రం కూడా బొగ్గే / కాని  దాని  కాంతి మాత్రం / మనస్సులో ముద్రించుకు పోతుంది / కవిత్వమంటే  అదే అన్నారు ప్రఖ్యాత కవి ఆచార్య ఎన్ గోపి. విషయ వైవిధ్యంతో నిర్మాణాత్మకమైన పద్ధతిని అవలంబిస్తూ ప్రావీణ్యతను కనబరిచే కవిత్వాన్ని రాసే కవులు తమ కవిత్వంతో చిరకాలం…

ర్యాగింగ్ ఓ రాక్షస క్రీడ…!!!

డిసెంబర్ 23 వ తేదీన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగడం చాలా దారుణమైన విషయం. ఈ ఘటనలో 81 మంది విద్యార్థులు సస్పెన్షన్ అయ్యారు. ఆదిమ మానవుడు నుండి నాగరిక సమాజంలోకి మనిషి అడుగు పెట్టినా బుర్రలో ఎక్కడో దాగి ఉన్న పైశాచిక బుధ్ధి అనుకూల పరిస్థితులలో బయటకు వచ్చి బుసలు కొడుతుంది. ఎదుటివారి…

దేశీయ విశ్వవిద్యాలయాల పునరుజ్జీవనం అసాధ్యమా…!

ప్రపంచవ్యాప్తంగా 23,625 యూనివర్సిటీలు ఉన్నత విద్యాబోధనలో నిమగ్నమై ఉండగా, మన భారతావనిలో 1,114 విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా వితరణ సేవలో పుణీతం అవుతున్నాయి. ప్రపంచ స్థాయి నాణ్యమైన 1,000 యూనివర్సిటీ ర్యాంకింగ్‌ల జాబితాలో మన దేశానికి చెందిన 91 యూనివర్సిటీలకు మాత్రమే చోటు దక్కడం గమనించాలి. దేశంలోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఎన్‌ఐటీలు లాంటివి మినహయిస్తే…

రెవెన్యూ పెత్తనాన్ని పెంచే భూ హక్కు చట్టం

ఏపీ భూ హక్కు చట్టం ప్రపంచ బ్యాంకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సర్వే 2019 లెక్కల ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్ విషయంలో భారత్ 154 వ స్థానంలో ఉంది. అంతేకాక 66 శాతం సివిల్‌ కేసులు భూమికి సంబంధించివే కోర్టుల్లో పెండింగ్ వున్నాయి. చట్టాలను అమలు చేసే విషయంలో ఇండియా 163 స్థానంలో ఉంది.ఈ…

నల్ల సూర్యులు ఏ దిక్కు పొడిచేనో ..!

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరవాత వస్తున్న సింగరేణి ఎన్నికల్లో అనూహ్యంగా బిఆర్‌ఎస్‌ దూరంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాయకులు కూడా రాజీనామా బాట పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరవాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో పట్టుకోసం బిఆర్‌ఎస్‌ ప్రయత్నించ లేదు. ఇకపోతే అధికారంలో ఉండగా సింగరేణి విషయంలో బిఆర్‌ఎస్‌ ఇచ్చిన…