ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యం ముంగిట్లో ఉంది..ఆర్థిక రాజకీయ సంక్షోభం తారా స్థాయికి చేరింది..సామ్రాజ్యావాద దేశాలు మూడో ప్రపంచ దేశాల ఆర్థిక వనరులు సహజ వనరులను దోచుకునేందుకు యుద్దాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాయి..ఆర్ధిక యుద్దాలన్నీ ఇప్పుడు రాజకీయ యుద్ధాలుగా క్రమంగా వేగంగా రూపాంతరం చెందుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత అది మరింత పెరిగింది..ఉక్రెయిన్ రష్యా వార్‌ను నుంచి పాలస్తీనా హిజ్రాయెల్ వరకూ యుద్ధ పిపాసతో ట్రంప్ ఊగిపోతున్నారు.
తాజాగా ఇండియాలో మధ్య భారత్‌పై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న మారణహోమం కూడా ఈ కోవాలోనే చూడిల్సిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశంపై మరో దేశం యుద్ధానికి దిగితే.భారత్ ప్రభుత్వం మాత్రం ఏకంగా సొంత ప్రజలపై యుద్దం ప్రకటించింది.దేశ సంపదను తన అనుకూల కార్పొరేట్ మిత్రులకు అప్పగించేందుకు ప్రభుత్వం అదివాసీలపై దండయాత్రకు దిగింది.ఈ నేపథ్యంలోనే దండకారణ్యం నుంచి అదివాసులను వెళ్లగొట్టేందుకు సర్కార్ ఆర్మీని దింపింది..2026 నాటికి అదివాసులు లేకుండా..వారి పోరాటానికి అండగా ఉంటున్న వారు లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ కగార్ పేరుతో. ఆపరేషన్ హిడ్మా ,ఆపరేషన్ కర్రెగుట్టలు అంటూ రకరకాల పేర్లతో మధ్య భారత్‌లో బలగాలు నెత్తురు పారిస్తున్నాయి. .తుపాకుల మోతలు.తూటాల గాయాలతో అడవిలో భయోత్పోతాలను సృష్టిస్తుంది.జీవనదుల్లో భూమి పుత్రులు రక్తాన్ని పారిస్తుంది..ఎట్టి పరిస్థితుల్లో వొచ్చే ఏడాది చివరి కల్లా మధ్య భారత్‌లో ఉన్న సహజ సంపదను కార్పొరేట్ శక్తులకు ఇప్పగించేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు దృఢ సంకల్ఫంతో ఉన్నారు. పాలనను గాలికి వదిలేసి కేవలం సంపద దోచుకునేందుకు అదివాసుల హననానికి ప్రభుత్వాలు తెగబడ్డాయి. దేశం మొత్తంగా సంపద దోపిడి పూర్తి అయింది.కేవలం ఆదివాసుల పోరాటం వల్లే మధ్య భారత్‌లో మిగిలిని సంపదను కూడా దోచుకునేందుకు వారిని వారి ప్రదేశాల నుంచి తొలగించేందుకు సైనిక యుద్ధానికి ప్రభుత్వం దిగింది.
ప్రపంచ వేదికలపై శాంతి మంత్రం జపించించే ప్రధాని మోదీ ..సొంత ప్రజలపై యుద్ధం చేస్తున్నారు..అంతర్జాతీయ సమాజం ముందు బుద్ధుడి ప్రవచనాలు, గాంధీ శాంతి సూక్తులు వల్లించారు .ప్రధాని మోదీ ఉక్రెయిన్లో పర్యటన సందర్భంగా. యుద్ధానికి దూరంగా ఉండడమే భారత్ ఎంచుకున్న రెండో మార్గం అని రష్యా ఉక్రెయిన్ పర్యటనలో ప్రకటించారు.భారత్ మొదటి నుంచి వైపు శాంతి ఉంది, మేము యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ భూమి నుండి వొచ్చామని చెప్పారు..
అంతేకాదు బుద్ధుడి నేల నుంచి వొచ్చిన వాళ్లం, ప్రపంచానికి శాంతి సందేశమిచ్చిన గాంధీ పుట్టిన దేశం మాది..మేం ప్రపంచ శాంతినే కోరుకుంటామని మోదీ తెలిపారు..యుద్ధభూమిలో పరిష్కారం సాధ్యం కాదని, బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య పరిష్కారాలు, శాంతి చర్చలు సఫలం కాలేవని, చర్చల ద్వారానే శాంతికి మార్గాన్ని వెతుక్కోవాలి అని ఉక్రెయిన్ పర్యటన లో చాలా గొప్పగా ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చారు. ఒకవైపు విశ్వ వేదికలపై ప్రధాని మోదీ శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు సొంత ప్రజలపై సైనిక యుద్ధాన్నిప్రకటించారు. గాంధీ బుద్ధుడి అడుగు జాడల్లో నడుస్తున్నాం అంటూనే.మధ్య భారత్ లో యుద్ధం మొదలు పెట్టారు..శత్రువులను చంపినట్లు సొంత బిడ్డలను నక్సల్ ముక్త్ భారత్ పేరుతో అమాయక ఆదివాసులను చంపేస్తూ నెత్తురు పారిస్తున్నారు. సొంత ప్రజలపై తుపాకి తూటాలు దించుతున్నారు..ఉక్రెయిన్ లో రష్యాలో నీతి వాక్యాలు చెప్పిన మోదీ కి సొంత దేశంలో శాంతి ఎందుకు కోరుకోవడం లేదు.?. యుద్ధ భూమిలో పరిష్కారం దొరకదు అని ప్రపంచ వేదికల మీద చెపుతూనే దండకారణ్యంలో యుద్ధం చేస్తున్నారు..
అంతర్జాతీయ సమాజం ముందు బుద్ధుడి ప్రవచనాలు, గాంధీ శాంతి సూక్తులు వల్లించారు . ప్రధాని మోదీ ఉక్రెయిన్లో పర్యటన సందర్భంగా. యుద్ధానికి దూరంగా ఉండడమే భారత్ ఎంచుకున్న రెండో మార్గం అని రష్యా ఉక్రెయిన్ పర్యటనలో ప్రకటించారు.భారత్ మొదటి నుంచి వైపు శాంతి ఉంది, మేము యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ భూమి నుండి వొచ్చామని చెప్పారు..
ప్రపంచ దేశాల మధ్య శాంతికి మధ్య వర్తిత్వం వహిస్తానని చేప్పుకున్న మోదీ ..మరి సొంత ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు..మావోయిస్ట్ పార్టీ చర్చలకు సిద్దమని..అందుకు సంబంధించిన చర్యలు ప్రభుత్వాలు ప్రారంభించాలని సీజ్‌ఫైర్ ప్రకటిస్తే.కేంద్రం ఎందుకు వారిపై ఏక పక్షంగా కాల్పులు జరుపుతూ దండకారణ్యంలో నరమేధాన్ని సృష్టిస్తున్నారు.రష్యా ఉక్రెయిన్ వార్ శాంతికి మధ్య వర్తిత్వం ముందుకు వొచ్చిన మావోయిస్ట్ పార్టీతో చర్చలకు ఎందుకు ముందుకు రావడం లేదు. పాక్, చైనా సహా ఇతర శత్రు దేశాలతో చర్చలు జరిపేందుకు ముందుకు వొచ్చిన కేంద్రం..ఎందుకు సొంత జాతి ప్రజలతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడం లేదు.
సొంత ప్రజలతో చర్చలంటే జంకుతున్నారు. ప్రపంచ వేదికలపై చూపించిన శాంతి మంత్రం సొంత ప్రజలపై ఎందుకు చూపించడం లేదు..నిజంగానే దేశంలో నక్సలిజాన్ని లేకుండా చేయలనే ఉద్దేశ్యమే కేంద్రానికి ఉంటే మావోయిస్టులతో కేంద్రం చర్చలకు ఎందుకు ముందుకు రావడం లేదు.నిజంగా మోదీ శాంతిని కోరుకుంటే.చర్చల ద్వారానే శాంతికి మార్గాన్ని వెతుక్కోవాలి నమ్మేది నిజం అయితే.గాంధీ, బుద్దుడి విధానాలపై విశ్వాసం ఉంటే వెంటనే మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలి.వెంటనే సీజ్ ఫైర్ ప్రకటించి.శాంతియుత వాతావరణం కల్పించాలి.చత్తీస్‌గడ్ నుంచి పారా మిలటరీ బలగాలను వెనక్కి రప్పించాలి.దండకారణ్యంలో నరమేధాన్ని తక్షణమే ఆపాలి.
సరిహద్దుల్లో గస్తీ కాయాల్సిన బలగాలను సొంత ప్రజలను అంతమొద్దించేందుకు ఉపయోగించడం నిలిపివేయాలి..నక్సల్ సమస్యకు సైద్దాంతికపరమైన ప్రత్యామ్నాయం కేంద్రం చూపాలి..ఇందు కోసం తక్షణమే చర్చలు జరపేందుకు పీస్ కమిటీ కేంద్రం ఏర్పాటు చేయాలి..ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న పెద్దల మాటను కట్టుబడి ఉండాలి..అలా కాకుండా ప్రపంచ వేదికలపై శాంతి జపం చేస్తూ సొంత ప్రజలపై యుద్దం ప్రకటించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం కేంద్రం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనం.
తుపాకి గొట్టం, తూటాల వర్షంతోనే నక్సల్ సమస్యకు పరిష్కారం దొరుకుందని కేంద్రం అనుకుంటే అది ఎప్పటిక సాధ్యం కాదు..ఒక అణచివేత మరో ఉద్యమానికి పురుడు పోస్తుంది..సమస్యను మూలాలు తెలుసుకుని పరిష్కరించకుండా తాత్కాలికంగా సమస్యను సైనిక చర్యతో తుడిచేస్తాం అంటే ప్రతిఘటన మరో రూపంలో వ్యక్తం అవుతుంది..సమస్య ఇంకో రూపాన్ని సంతరించుకుంటుంది తప్ప మాసిపోదు. దండకారణ్యంలో జాతి హననాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా వ్యతిరేకించాలి..కేంద్రం వెంటనే మధ్య భారత్‌పై ఏకపక్ష యుద్దాన్ని అడ్డుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి..దేశంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ..సొంత ప్రజలపై కేంద్రం ప్రకటించిన యుద్దానికి మించిన సమస్యను ఎత్తిపట్టడానికి మించిన మరో సమస్య లేదు..కాంగ్రెస్ పార్టీ వెంటనే తాను అధికారంలో ఉన్న తెలంగాణలో, కూటమిలో ఉన్న జార్ఖండ్‌లో కాల్పుల విరమణ పాటించాలి.
జాతీయ స్థాయిలో అఖిల పక్షం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి శాంతి చర్చలకు మార్గం వేయాలి. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు ప్రజా పోరాటాలు చేయాలి. దండకారణ్యంలో కేంద్రం చేస్తున్న మారణహోమంలో బీజేపీ పాత్ర ఎంత ఉందో..కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా అంతే ఉంది. ఆరు దశాబ్దాలుగా రక్తపాతం సృష్టించిన కాంగ్రెస్ ఇప్పుడు తన చేతులకు అంటిన రక్తాన్ని శాంతి చర్చ జరిపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువొచ్చి కడుక్కునే అవకాశం ఉంది..ప్రజా సంఘాలు, పౌర సమాజం కూడా గతంలో ఫలా పార్టీ ఇలా చేసింది.ఇంకో పార్టీ అలా చేసింది..అన్న పిడి వాదాన్ని పక్కనపెట్టి ప్రాంతీయ పార్టీలన్నిటినీ చర్చలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించడంలో అందరిని కలుపుకుపోవాలి..రాజ్యం చాలా బలంగా ఉంది..దాన్ని ఎదుర్కొవాలంటే సిద్దంతాలు, వైరుధ్యాలు పక్కనబెట్టి కలుపుకు పోయినప్పుడు మాత్రమే కేంద్రం చేస్తున్న జాతి హననాన్ని ఆపవొచ్చు..చర్చలకు మార్గం వేయవొచ్చు..శాంతిని నెలకొల్పవొచ్చు..ఒక ఉద్యమాన్ని కాపాడుకోవొచ్చు.
-తోటకూర రమేష్