సచివాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

– ప్రత్యేక పూజల్లో ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా సచివాలయ ఆవరణలోని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజjáYT జాజు పాల్గొని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్థిల్లాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బోనాలను సమర్పించగా పోతరాజుల విన్యాసాలు, డప్పుల వాయిద్యాలు, వివిధ వేషధారణలతో కళాకారుల ప్రదర్శనలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉద్యోగులు, అధికారులు అధిక సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

మంత్రి సీతక్క పూజలు 

రాష్ట్ర సచివాలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సీతక్కకు సచివాలయ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *