ఇరాన్‌పై దాడుల ప్రభావం కొద్ది నెలలే

అమెరికా రహస్య నివేదిక వెల్లడి
కాదు.. అవన్నీ ఫేక్‌ అంటున్న అమెరికా అధ్యక్షుడు
నోబెల్‌కు ట్రంప్‌ పేరు ప్రతిపాదన

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌లో మూడు అణు కేంద్రాలపై అమెరికా వేసిన బాంబు దాడుల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని అమెరికా రహస్య నివేదిక పేర్కొంది. ఈ దాడులు ఇరాన్‌ న్యూక్లియర్‌ సౌకర్యాలను పూర్తిగా ధ్వంసం చేయలేదని ఆ నివేదికలొని ప్రాథమిక వివరాలు, దాని గురించి అవగాహన కలిగిన అధికారులు వెల్లడిరచారు. ఈ దాడులు ఇరాన్‌లోని రెండు అణ్వాయుధ కేంద్రాల ప్రధాన ద్వారాలను మాత్రమే మూసివేసిందని, భూమి లోపల ఉన్న అసలు నిర్మాణాలను ఏమీ చేయలేకపోయిందని ఆ నివేదిక షాకింగ్‌ విషయాలను వెల్లడిరచింది. ఇరాన్‌ అణు బాంబును తయారు చేసేందుకు ప్రయత్నిస్తే అందుకు సుమారు మూడు నెలలు పడుతుందని దాడికి ముందే అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు అంచనా వేసాయి. అంతేకాకుండా, దాడికి ముందు ఇరాన్‌ తన శుద్ధీకరించిన యూరేనియం నిల్వల్లో చాలావరకు వేరే ప్రదేశానికి తరలించిందని కూడా ఆ నివేదిక పేర్కొంది.
కొంతమంది ఇజ్రాయెలీ అధికారులు కూడా ఇరాన్‌ ప్రభుత్వం చిన్నస్థాయిలో రహస్యంగా ఎన్‌రిచ్‌మెంట్‌ కేంద్రాలను కొనసాగించినట్లు నమ్ముతున్నట్టు తెలిపారు. పెద్ద కేంద్రాలపై దాడులు జరిగితే అణు కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వీటిని ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. అయితే ఇవన్నీ ఫేక్‌ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొట్టిపారేశారు. ఇరాన్‌పై తాము నిర్వహించిన వైమానిక దాడులు తీవ్ర ప్రభావం చూపాయని, ఆ దేశ న్యూక్లియర్‌ సౌకర్యాలను పూర్తిగా ధ్వంసం చేశాయని చెబుతున్నారు. కాగా, తన సోషల్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌లో ట్రంప్‌ ఇలా పేర్కొన్నారు. ‘ఈ వార్తలు ప్రచురించే సీఎన్‌ఎన్‌, న్యూయార్క్‌ టైమ్స్‌లు కలిసి ఈ చారిత్రక విజయవంతమైన సైనిక దాడిని చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇరాన్‌లోని న్యూక్లియర్‌ సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. ఈ మీడియా సంస్థలు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయ’ని తెలిపారు.

నోబెల్‌ బహుమతి ఆలోచన వీడని ట్రంప్‌

ఇదిలా ఉండగా నోబెల్‌ శాంతి బహుమతి పొందాలన్న ట్రంప్‌ ఆకాంక్ష అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఆయన పేనును అధికారికంగా నామినేట్‌చేశారు. ఆయన పేరును అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డీ కార్టర్‌ నార్వేలోని నోబెల్‌ కమిటీకి ఓ లేఖ పంపారు. ’అసాధ్యమనుకున్న సంకక్షోభాల్లో కూడావేగంగా ఒప్పందాలు చేయించడంలో ట్రంప్‌ కీలక పాత్ర పోషించారు. ఇరాన్‌Iఇజ్రాయెల్‌ మరaధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో చరిత్మ్రక పాత్ర పోషించారు.. దీంతోపాటు ప్రపంచంలోనే ఉగ్రవాదులను పోషించే అతి పెద్ద దేశానికి అత్యంత వినాశకర ఆయుధం అందకుండా చేశారు.. ఆయన నాయకత్వాన్ని నోబెల్‌ ప్రైజ్‌తో గుర్తించాలి‘ అని కోరారు. కాగా, ట్రంప్‌ పేరును ఉక్రెయిన్‌కు చెందిన చట్టసభ సభ్యుడు అలెక్సాండర్‌ మెరెరaూకో కూడా నోబెల్‌కు ప్రతిపాదించారు. కానీ అమెరికా అధ్యక్షుడు రష్యాIఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపడంలో విఫలం కావడంతో ఇప్పుడు తాజాగా ఆ నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నటు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page