ముంచుకొస్తున్న ఇరాన్ డెడ్‌లైన్
ఆఫ్ఘనిస్థాన్ : తమ దేశంలో అకమ్రంగా నివసిస్తున్న ఆఫ్గనీయులపై ఇరాన్ విధించిన డెడ్‌లైన్ కారణంగా సుమారు 2.30 లక్షల మంది ఆఫ్ఘనీయులు ఆ దేశం విడిచి తమ స్వదేశానికి చేరుకున్నారు. జూలై 6లోగా తమ దేశం వీడివెళ్లాలన్న టెహ్రాన్ ఆదేశాలతో లక్షలాదిమంది ఆఫ్గానీయులు స్వదేశం పయనమయ్యారు. జూన్ 1 నుంచి 28వ తేదీ వరకు మొత్తం 2,33,941 మంది ఇరాన్ నుంచి ఆఫఘనిస్థాన్‌కు తిరిగి వచ్చినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్’(ఐఓఎం) ప్రతినిధి అవంద్ అజీజ్ ఆఘా తెలిపారు. ఒక్క జూన్ 21 నుంచి 28వరకు వారం రోజుల్లోనే 1,31,912మంది తిరిగొచ్చారన్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6.91 లక్షల మందిని ఇరాన్ సాగనంపగా వీరిలో 70 శాతంమందికిపైగా బహిష్కరణకు గురైనవారేనని ఆయన వెల్లడిరచారు. ఇజ్రాయెల్Iఇరాన్ యుద్ధం పరిణామాలు, టెహ్రాన్ విధానాల్లో మార్సుల వంటివి ఆఫ్గనీయుల బహిస్కరణకు కారణమయ్యాయని ఆఫ్గానిస్థాన్‌లో ఐక్యరాజ్య సమిటి మిషన్ పేర్కొంది.