జన్మదినం సందర్భంగా తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం
హనుమకొండ, ప్రజాతంత్ర : రెడ్ క్రాస్ సొసైటీలో పాలకవర్గ సభ్యులు ఈవీ శ్రీనివాస్ కృషి స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఇ.వి. శ్రీనివాస్ రావు తన 57వ పుట్టినరోజును పురస్కరించుకుని కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలనే సంకల్పంతో ఆదివారం హనుమకొండ సుబేదారిలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో భారీ రక్తదాన శిబిరాన్ని (Blood Donation Camp) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్ రామ్ రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇ.వి. శ్రీనివాస్ రావుతో కేక్ కట్ చేయించి, పుష్పగుచ్ఛం, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈవీ శ్రీనివాస్ రావు తన చిన్ననాటి మిత్రుడని, ఏదైనా పని చేపడితే అది పూర్తయ్యే వరకు విశ్రమించని పట్టుదల కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజలకు సేవ చేయాలనే ఆయన తపన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
కుడా చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో శ్రీనివాస్ రావు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని అన్నారు.
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ అధ్యక్షురాలు లైలా మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరికీ చేదోడువాదోడుగా ఉంటూ, మానవత్వాన్ని చాటుకుంటున్న వ్యక్తి శ్రీనివాస్ రావు అని అన్నారు.
ప్రతి శుభకార్యం రక్తదానంతో ముడిపడాలి: ఇ.వి. శ్రీనివాస్ రావు
తలసీమియా బాధితులకు నిరంతరం రక్తం అవసరమని, వారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేశానని ఈవీ శ్రీనివాస్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులు లేదా ఇతర వేడుకల సందర్భంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి. విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, డాక్టర్ కె. సుధాకర్ రెడ్డి, డాక్టర్ సిహెచ్. సంధ్యారాణి, చెన్నమనేని జయశ్రీ, బిళ్ల రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమనేని జగన్ మోహన్ రావు, కార్యదర్శి ఫణికుమార్, హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మాధవరెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకన్న, శ్రీమాన్, మానస రాంప్రసాద్, భూపాలపల్లి రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు బొద్దిరెడ్డి సతీష్ రెడ్డి, రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు సోదా రామకృష్ణ, బంక సంపత్, బంక సరళ, బొల్లం శివ, మానుపాటి శ్రీను, నేహాల్, శివకుమార్ రెడ్ క్రాస్ సిబ్బంది, అలాగే పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.





