అయ్యప్ప దీక్షతో మనిషిలో పరివర్తన

– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
– ప్రభుత్వ విప్‌ ఐలయ్య నివాసంలో మహా పడిపూజ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: అయ్యప్ప దీక్ష మనిషిలో గొప్ప పరివర్తన తీసుకు వస్తుందని, ఈర్ష్యాద్వేషాలు, దురలవాట్లు తగ్గి సమాజం పట్ల కరుణ గుణం కలుగుతుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్‌ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్టలోని తన స్వగృహంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయ్యప్ప నామస్మరణతో పడి పూజ అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ తనకు అయ్యప్ప స్వామి అంటే అత్యంత ఇష్టమంటూ ఇంతమంది అయ్యప్ప భక్తులను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. సాటి మనిషిని ప్రేమించమనే భగవంతుడు కూడా చెబుతాడన్నారు. 41రోజుల కఠిన దీక్షలో సాక్షాత్తు అయ్యప్పను మీలో చూస్తామన్నారు. దీక్షలో కఠిన నియమాలు పాటించే భక్తుల్లో గొప్ప మార్పు కలుగుతుందన్నారు. అయ్యప్ప స్వామి దయతో రైతులు పాడి పంటలతో, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాని మంత్రి చెప్పారు. ఇంత మంచి వాతావరణంలో పడి పూజ కార్యక్రమం నిర్వహించిన బీర్ల ఐలయ్యకు అభినందనలు కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, డీసీసీ అధ్యక్షులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page