పదకొండేళ్ల ఫలహారపు, ప్రతీకారపు తెలంగాణ!

మనం సాధించుకోవలసినది ఏమిటి, భౌగోళిక తెలంగాణనా, ప్రజాస్వామిక తెలంగాణనా, సామాజిక తెలంగాణనా అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు జరుగుతుండేవి. ఎవరికి వాళ్లు తమ భావనల మీద గట్టిగా వాదనలు వినిపిస్తుండేవారు. ఉన్న వ్యవస్థ లోపల ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధించడం సాధ్యం కాదని, అందువల్ల మొట్టమొదట కనీసమైన భౌగోళిక తెలంగాణ సాధించుకుంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని సామాజికీకరించడం…









