special Stories

special Stories

డిజిట‌ల్ ఇండియా నుంచి ఇండియా ఫ‌ర్ ది వ‌ర‌ల్డ్ వ‌ర‌కు ప్ర‌స్థానం..

న‌రేంద్ర‌మోదీ, ప్ర‌ధాన‌మంత్రి స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం మ‌నం, అప్ప‌టివ‌ర‌కు మ‌న‌కు తెలియ‌ని ఒక కొత్త ప్ర‌దేశంలోకి గొప్ప నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌వేశించాం. అంత‌కుముందు ద‌శాబ్దాలుగా అస‌లు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించ‌గ‌ల‌మా? అన్న సందిగ్ధంతో గ‌డిపాం. మ‌నం ఈ అభిప్రాయాన్ని స‌మూలంగా మార్చివేసి, భార‌తీయులు సాంకేతిక‌త‌ను చ‌క్క‌గా ఉప‌యోగించు కోగ‌ల‌ర‌న్నవిశ్వాసంతో ముందడుగు వేశాం. మ‌నం ఈ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని…

రవివర్మ ఫోటో చెప్పిన జనధర్మ కథ

13. జనధర్మోవిజయతే దృఢమైన సంకల్పంతో జనధర్మ రవివర్మ అనే కథ చదవాల్సిందే. శ్రీ ముస్తాల శంకరరావు, శ్రీ యాదగిరాచార్య, శ్రీ దివ్వెల హన్మంతరావు శ్రీ యం.యస్‌. ఆచార్యగారు నలుగురూ 1958 నవంబర్‌లో ‘జనధర్మ’ వారపత్రికను ప్రారంభించారు. బిట్ల నారాయణగారి రవివర్మ ఫోటో స్టూడియోలోనే సమావేశమై పత్రిక ప్రచురణను నిర్ణయించారు. జనధర్మతో చాలా సంబంధాలు ఉన్న వారిలో…

బనకచర్ల కు బ్రేక్!

politics on Banakacharla!

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయ జోక్యం మితి మీరితే అందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పాటికే ఉంది . అయినా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవేవీ పట్టించుకోకుండా సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. తన సహజ శైలిలో గేమ్ ఛేంజర్ గా పదేపదే ప్రకటనలు…

మేడిగడ్డపై కుట్రలు.. మినిట్స్‌ కొత్త డ్రామాలు

Conspiracies on medigadda

నిజం గడపదాటేలోపే అబద్దం ప్రపంచాన్ని చుట్టేస్తుంది.. కానీ నిజానికి నిలకడ ఎక్కువ..లేటైనా లేటేస్ట్‌గా బయటకు వస్తుంది..ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెపుతున్నాం అంటే..కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ సంధర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు, అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తెలంగాణకు వరప్రధాయిని అయిన కాళేశ్వరంపై  ఉద్దేశ్యపూర్వకంగానే కుట్రలు చేసినట్లు జస్టిస్‌ ఘోష్ కమిషన్‌ విచారణకు …

విద్యలో ఏఐ పాత్ర ఆర్టికల్

విద్యలో విప్లవాత్మక మార్పులు ఏఐ తో సాధ్యం విద్యార్థుల్లో చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాలు పెంపొందించేందుకు ఏఐ ఎంతగానో దోహదపడనుంది.వారి సామ‌ర్థ్యాన్ని మ‌రింత మెరుగుప‌రిచే విధానంలో ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.ఇంత‌కు ముందు ప్రాథమిక విద్యార్థుల‌కు కనీస అభ్యర్థన సామర్థ్యాల పెంపునకు ఫౌండేషనల్ లిటరసీ న్యూమర్సీ (ఎఫ్ఎల్ఎన్) ప్రోగ్రామ్‌ను అమ‌లు చేశారు.ఇప్పుడు, మ‌రోసారి ఏఐ విద్య‌తో…

భూభారతి బాధితులు ఉండకూడదు

There should be no victims of Bhubharathi.

గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో ప్రజలు భూసంబంధిత సమస్యలతో సతమతమయిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ‘ధరణి’ పోర్టల్ బాధితుల అవస్థలు అయితే వర్ణనాతీతమే. రకరకాల సమస్యలతో జనం ఇక్కట్లు పడ్డారు..ఇప్పటికీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ‘ధరణి’ స్థానంలో ‘భూభారతి’ చట్టం తీసుకొచ్చింది. సుమారు 9 వేల పై చిలుకు భూభారతి…

‘వైద్యో నారాయణః’ నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం

శత్రువుల నుండి దేశాన్ని కాపాడే సైనికుల్లాగే రోగాల బారి నుండి మన శరీరాన్ని రక్షించేవారు వైద్యులు. ‘వైద్యో నారాయణః’ అన్న మాట వారి గొప్పదనాన్ని చాటి చెబుతుంది. మందులు రోగాలను నయం చేస్తే వైద్యులు మాత్రమే రోగులను స్వయంగా నయం చేస్తారు. తమ వ్యక్తిగత జీవితాలను సైతం పక్కనబెట్టి ఎన్నో బాధలున్నా నవ్వుతూ రోగుల కష్టాలను…

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ‘ అగ్ర’ తాంబూలం..!

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

సుదీర్ఘకాలంగా పెండింగ్‌ ‌లో ఉన్న భారతీయజనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం అధ్యక్ష పదవి పోటీకి నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌ .‌రాంచందర్‌ ‌రావు ఒక్కరే పత్రాలు దాఖలు చేయడం తో ఆయన ఎంపిక లాంఛనప్రాయమే అయింది.అధ్యక్ష పదవి…

త్యాగానికి స్ఫూర్తి ప్రదాత హజ్రత్ హుస్సేన్

వారం రోజుల పాటు  మొహర్రం వేడుకలు హిందువులు, ముస్లిం సోదరులూ సమిష్టిగా జరుపుకునే మొహర్రం ప్రత్యేకత సంతరించుకుంది. త్యాగానికి, మహోన్నత సనాతన సాంప్రదాయానికి, మత సామరస్యానికి ప్రతీక మొహర్రం వేడుక. మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్‌ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ కేలండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు (అరేబియాలోని యూదులు,…

విధాన లోపం – విద్యకు శాపం

గత 30 ఏండ్లుగా వినబడిన మాట ప్రభుత్వ పాఠశాలల విస్తరణ – విద్యావ్యాప్తి. గత పదేళ్లుగా వినబడుతున్న మాట ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దీకరణ (రేష్నలైజేషన్). 19 కంటె తక్కువ విద్యార్ధులున్న ప్రాథమిక పాఠశాలలను, 75 కన్నా తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలను సమీపంలో ఉన్న వేరొక పాఠశాలలో విలీనం చేయడం. ఈ రకమైన విలీనానికి ప్రభుత్వం…