special Stories

special Stories

కాగల కార్య గంధర్వ బబ్లూ!

 “ఇంకో మాట చెప్పు” అంది అనసూయ. మాలతి మాట్లాడలేదు. “అంతేలే, యెవరైనా ఆరుమాసాలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, అలాంటిది ఆరేళ్ళు సంసారం చేస్తే?” నవ్వింది అనసూయ. మాలతి నవ్వలేదు. “కానీ, భార్యాభర్తల్లో యెక్కువ మంది భర్తల్నే అనుసరిస్తారు భార్యలు” చివరి పదం వొత్తి పలుకుతూ అంది అనసూయ, ఆమాటలో ‘నువ్వు కూడా అంతే, అందర్లానే’…

‘Biased’ కేవలం పుస్తకం కాదు…

తోటి మనుషుల పట్ల సమూహాల పట్ల మనము పెరిగిన సామాజిక నేపధ్య ప్రభావాలతో ముందే ఏర్పరుచుకున్న అభిప్రాయాలను జాతి, రంగు, ప్రాంతం పేర్లతో చూపించే పక్షపాత వైఖరుల గురించి  జెన్నిఫర్ ఎల్. ఎబర్‌హార్డ్ అనే రచయిత ఒక పుస్తకం రాసారు. ఒక ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా తనకు ఎదురైన పరిస్థితులు, స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తగా…

చిన్నారి గుండెల్లో ఊహాశక్తి

కథ, నవల, బాల సాహిత్య రచయిత, సామాజిక కార్యకర్త వి.శాంతిప్రబోధతో బాలల దినోత్సవం సందర్భంగా బాలసాహిత్య తీరుతెన్నులపై ముఖాముఖి బాల సాహిత్యం పరిధి అంటే ఏం చెపుతారు? బాలసాహిత్యం అంటే కేవలం కాలక్షేపం కోసం చెప్పే కథలు, పాటలు మాత్రమే కాదు. ఇది పిల్లల మనసుకు పోషకాహారం లాంటిది. చిన్నారి గుండెల్లో ఊహాశక్తిని పెంచే, ఆలోచనలకు…

రెప్పలేని కన్ను

విజ్ఞాన సాంకేతిక సార్వభౌమా మానవుడా.. అభినవ దానవుడా ఈ వింతల విశ్వాన్ని వీక్షిస్తున్న సంబరం నీరుగారుతోంది నిద్దుర లే ఏం చెప్పనయ్యా ఇప్పుడు బ్రతుకు రెప్పలేని కన్నయ్యింది గరగరల గరళం కన్ను దిగుతోంది చూశావా నీ రెటీనా చాటున దాగిన దృశ్యాన్ని బజారున బహిరంగ పరుస్తున్నారెవరో హ్యాకింగ్ హుక్స్ ఒళ్లంతా పొడుస్తున్నాయి భద్రతగా వాల్చుకున్న రెప్పల్ని…

ఉల్లంఘనలు కనబడని, వినబడని ఎలక్షన్ కమిషన్!

“జూబిలీ హిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎల్ దీపక్ రెడ్డికి ప్రచారంలో మాట్లాడుతూ బండి సంజయ్, ఆ అభ్యర్థి గుణగణాల గురించి చెప్పి వోటు అడిగే బదులు, ఈ ఎన్నికను హిందువులకూ ముస్లింలకూ మధ్య యుద్ధంగా అభివర్ణించి, హిందువులందరూ బిజెపి అభ్యర్థికి వోటు వేయాలని కోరారు. భారతదేశంలో ఎన్నికలను…

మరాఠీ శాసనసభలో తెలుగు పరిమళం

“వరస కరువులతో బుక్కెడు బువ్వ కోసం తెలంగాణా ప్రాంతం నుండి మూడున్నర శతాబ్దాల క్రితం ముంబయికి (అప్పటి బొంబాయి) వలస వెళ్ళి, అక్కడ నిలదొక్కుకొని, తాము జీవితంలో ఎదగడమేకాకుండా వందలాది మందికి ఉపాధి కల్పించి, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాహిత్య రంగాల్లో శిఖరాగ్రాలను అందుకున్న వారెందరోఉన్నారు.. కానీ, ప్రాంతీయ వివక్షల వల్లనో, పాలకుల ఆధిపత్య నిర్లక్ష్యం…

ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ ఫలితాలు కావు..

“ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తేడా 5 శాతం గా ఇచ్చాయి.. అదే సమయంలో బీజేపీ వోట్ షేర్ 14 శాతం నుంచి 6 నుంచి 8 శాతం తగ్గినట్లు ఇచ్చాయి.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ  వోట్ షేర్ సగానికి పైగా ఏటు పోయింది అనేది…

అప్పుల ఆనందం! ఆర్థిక ప‌రిస్థితి విషాదం!!

“చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం తమ ఆర్థిక ఇబ్బందులకు గత ప్రభుత్వం చేసిన అపరిమిత అప్పులే కారణమని ఆరోపిస్తోంది. అవి రుణ భారాన్ని పెంచాయని వాదిస్తోంది. అయితే, ప్రస్తుత నాయకత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా, మద్దతుదారుల నుంచి భిన్నమైన వాదన వినిపిస్తోంది. వారు అప్పులను “వనరుల సమీకరణ”గా అభివర్ణిస్తున్నారు. గతంలో ఇదే మీడియా వర్గాలు…

శ్రీబాగ్ ఒప్పందం మరచిపోవాలా ..?

“1953లో కర్నూలును రాజధానిగా, గుంటూరును హైకోర్టు కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా, 1956లో తెలంగాణ విలీనంతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని, హైకోర్టు రెండూ హైదరాబాద్ కు మారాయి. ఈ పరిణామాలు రాయలసీమకు హామీలు కొనసాగుతాయా అన్న సందేహాలు మరింత పెంచాయి.ప్రస్తుత పరిస్థితి: అసంతృప్తి, వెనుకబాటుతనం విభజన (2014) తరువాత జిల్లా పునర్‌వ్యవస్థీకరణ, నీటి కేటాయింపులు,…

అంతా దగుల్బాజీ- కౌటిల్యం కాక ఇంకేమిటి?

“తెలంగాణా ప్రాంతానికి “వరప్రసాది.” అయిన ఈ ప్రాజెక్టు కుదించి వేస్తే వేశారు. పోనీ సత్వరం నిర్మించుతారా అంటే అదీ లేదు. నాలుగో ప్రణాళికాంతం వరకు పూర్తవుతుందని డబ్బా వాయిస్తున్నారు ఎందుకు ఆలస్యం అంటె డబ్బులేదంటారు. మిగులు నిధులు కోట్లు మావి ఉన్నవి కదా వాటిని ఖర్పు పెట్టండీ అంటే “పాత కోట్లా కొత్త కోట్లా” అంటాడు…