prajatantra_news

prajatantra_news

టిటిడి అక్రమాలపై చంద్రబాబుకు లేఖ రాస్తా

బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ తిరుమల, ప్రజాతంత్ర, జూలై 3: జగన్‌ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అక్రమాలు జరిగాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. గతంలో ఉన్న టీటీడీ పాలకమండళ్లు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని విమర్శించారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం…

మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్‌

న్యూఢల్లీి, జూలై 3:మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారని భారత విదేశాంగ శాఖ గురువారం ధ్రువీకరించింది. పశ్చిమ మాలిలోని కాయెస్‌ ప్రాంతంలోని డైమెండ్‌ సిమెంటు ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 1న ఈ ప్రాంతంపై సాయుధ దుండగులు దాడి చేసి అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. వారిలో భారత్‌కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు.…

అమెరికా ఆంక్షలపై అధ్యయనం చేస్తున్నాం

లిండ్సే గ్రాహంతో టచ్‌లో ఉన్నాం వాషింగ్టన్‌ విూడియా సమావేశంలో జైశంకర్‌ వాషింగ్టన్‌, జూలై 3: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికా చేసుకొనే దిగుమతులపై 500 శాతం పన్నుతో ’ఆర్థిక బంకర్‌ బస్టర్‌’ జారవిడుస్తామంటూ అమెరికా సెనెటర్‌ లిండ్సే గ్రాహం వ్యాఖ్యలపై భారత్‌ స్పందించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ వాషింగ్టన్‌లో…

ముగ్గురిని కబళించిన జెనరేటర్‌ పొగ

చెన్నై : ఓ పోర్టబుల్‌ జెనరేటర్‌ ముగ్గురి ప్రాణాలు తీసిన ఉదంతమిది. ఆ ముగ్గురూ తండ్రీకొడుకులు కావటం గమనార్హం. ఈ విషాద సంఘటన తమిళనాడులోని చెన్నైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైకి చెందిన 57 ఏళ్ల సెల్వరాజ్‌ తన ఇద్దరు కొడుకులు…

ఏసీబీ విచారణకు అర్వింద్‌ కుమార్‌ హాజరు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ మూడోసారి ఏసీబీ విచారణకు గురువారం హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో నిధుల బదలాయింపులో ఆయన కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేస్తూ కేబినెట్‌ అనుమతి లేకుండా…

21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

న్యూదిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 21 నుంచి జరగనున్నాయి. సమావేశాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం తెలిపారు. ఆగస్టు 21 వరకు సమావేశాలు జరుగుతాయని, స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు జరగవన్నారు. కాగా, ఈ సమావేశాలు జూలై 21…

తెలంగాణ జన సమితి సూచనలు స్వీకరిస్తా

తనను కలిసిన నేతలతో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) బృందం బుధవారం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో సీఎంను కలిసిన ఆ పార్టీ నేతలు ప్రజా సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి…

గ్లోబల్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఏఐగా తెలంగాణ

ఎమర్జింగ్‌ టెక్నాలజీ కాదు.. అవకాశాల గని ‘మార్పు’ను అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ రెండేళ్లలో రెండు లక్షల మంది ఏఐ నిపుణులు ‘తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: రెండేళ్లలో రెండు లక్షల మంది తెలంగాణ యువతను అత్యుత్తమ ఏఐ రంగ నిపుణులుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని…

పాశమైలారం ఘటనపై దర్యాప్తు చేపట్టాలి: ఓవైసీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి 38 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. మృతుల్లో ఎక్కువగా జార్ఖండ్‌కు చెందిన…

17న రైలురోకో చేసి తీరుతాం

ఖమ్మంలో పోస్టర్‌ ఆవిష్కరించిన కవిత ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 2: బీసీ రిజర్వేషన్లు ఆమోదం పొందిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈనెల 17న రైలు రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు.…