prajatantra_news

prajatantra_news

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం భేటీ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జులై 17: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రేవంత్‌ వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డిలు కూడా ఉన్నారు. సుమారు గంటసేపు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై…

హెచ్‌సీఏ అక్రమాలు.. కేటీఆర్‌, కవితపై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు

హైదరాబాద్‌, జులై 17: తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారులు గురువారం సీఐడీ అధిపతి చారుసిన్హాను కలిసి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొంతమందిపై ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్‌, కవిత హస్తం ఉందని వారు ఆరోపించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌ రావు గెలిచిన వెంటనే…

మహిళల ఆర్థిక స్వావలంబనే మా లక్ష్యం

– ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే లింగ భేదం సమస్య నివారణ – స్వయం సహాయక సంఘాలతో 2,000 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి – లింగ సమానత్వం సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే లింగ వివక్ష సమస్య…

సనత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నగరంలోని సనత్‌నగర్‌ సమతనగర్‌లోని డ్యూరోడైన్‌ ఇండస్ట్రీస్‌ గోదాములో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆరు ఫైరింజన్లు, ఒక రోబోట్‌ సహాయంతో మంటలను అదుపు చేశారు. ప్లాస్టిక్‌ ప్లేట్స్‌, డిన్నర్‌ సెట్స్‌ ప్యాకింగ్‌ వస్తువులు ఉండడంతో అవి…

విజయవంతంగా ‘మహిళా శక్తి’ సంబురాలు

– బతుకమ్మ పండుగను తలపించిన ఉత్సవాలు – మంత్రులు, ఎమ్మెల్యేల చెక్కుల పంపిణీతో వెల్లివిరిసన ఉత్సాహం – రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు – ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో అగ్ర భాగాన మంత్రి సీతక్క – నేటితో ముగియనున్న సంబురాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 17: ఇందిరా మహిళా శక్తి సంబురాలు…

బనకచర్లపై తలోమాట తగదు

– ఎజెండాలోని ఇతర అంశాలపై నిపుణుల కమిటీని నియమించింది – జల వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంల మీటింగ్‌ కేంద్ర తొలి విజయం – కేంద్రానికి ఇరు రాష్ట్రాలు సమానమే – బీజేపీలో గ్రూపుల్లేవ్‌.. ఉన్నదల్లా మోదీ గ్రూపే – కేంద్ర మంత్రి బండి సంజయ్‌బండి హుజూరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: బనకచర్ల విషయంలో ఇరు…

అభ్యసన సామర్థ్యాల ఖిల్లా జనగామ జిల్లా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: విద్యార్థుల లభ్యస సామర్థ్యాలలో దేశంలోని 50 అత్యుత్తమ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం నుంచి జనగామ జిల్లాకు చోటు లభించింది. తెలుగు రాష్ట్రాలలో ఈ ఒక్క జిల్లాకే ఈ అవకాశం దక్కింది. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారం యంత్రాంగం పనిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడానికి ఇదే నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సామాజిక…

పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు సహకరించండి

సీఎం రేవంత్‌కు కేందమంత్రి కిషన్‌రెడ్డి లేఖ దిల్లీ, ప్రజాతంత్ర, జులై 17: భారత దేశపు దీర్ఘకాల ప్రణాళికలైన ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణను సాకారం చేసుకోవడంలో భాగంగా ఆర్థిక పురోగతిని, అభివృద్ధి అవకాశాలను సమతుల్యం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి…

కొండచరియలు విరిగిపడి మహిళ మృతి

అమర్‌నాథ్‌ యాత్ర రద్దు దిల్లీ: అమర్‌నాథ్‌ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ భక్తురాలు మృతిచెందింది. భారీ వర్షాల కారణంగా గందర్‌బాల్‌ జిల్లా బల్తల్‌ ఏరియాలోని అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే మార్గాల పరిస్థితి దారుణంగా మారింది. కొండచరియలు విరిగి బురదమట్టితో కలిసి కిందకు జారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం…

అశ్వారావుపేటను సుందరీకరిస్తాం

– దొంతికుంట చెరువుకు రింగ్‌ బండ్‌ ప్రణాళికలు సిద్ధం చేయండి. – అశ్వరావుపేట మార్నింగ్‌ వాక్‌లో మంత్రి పొంగులేటి దమ్మపేట/అశ్వారావుపేట, ప్రజాతంత్ర, జూలై 17 : అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న అశ్వరావుపేట పట్టణాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో సుందరీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచాం, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…