prajatantra_news

prajatantra_news

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు

-పెండిరగ్‌లోని రూ.80.38 కోట్ల మెడికల్‌ రీయింబర్స్మెంట్‌ బిల్లులు ఒకేసారి క్లియర్‌ -26,519మందికి ఊరట -గత ప్రభుత్వంలోని పెండిరగ్‌ బిల్లులను సైతం క్లియర్‌ చేసిన డిప్యూటీ సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌ రియంబర్స్మెంట్‌ పెండిరగ్‌ బిల్లుల మొత్తం రూ.180.38…

బనకచర్లను అడ్డుకుంటాం

నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: తెలంగాణ రైతాంగం ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూడడమే తమ ముందున్న కర్తవ్యమని నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ఏవిధంగా దెబ్బతింటాయోనన్న…

అసంపూర్తి ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయాలి

భ‌విష్య‌త్  ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాలి అధికార్ల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు  అభివృద్ధి ప‌నుల‌ను ముఖ్య‌మంత్రికి వివ‌రించిన అధికారులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 25:  అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధ‌వారం  మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవెలప్ మెంట్  అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా…

పర్యాటకం అభివృద్ధికి అవకాశాలు పుష్కలం

పర్యాటక, ఎక్సైజ్‌ శాఖల మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయని, టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమశిల వెల్‌నెస్‌, స్పిరిచ్యువల్‌…

రైతు భరోసాపై సంబరాలు ఎందుకో?

కాంగ్రెస్‌ను నిలదీసిన బీజేపీ ఎంపీ డీకే అరుణ  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌కు లేదని బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. రెండెకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా ఇంకా రాలేదని, అలాంటప్పుడు రైతు భరోసా పేరుతో సంబురాలు ఎందుకు చేసుకుంటున్నారో కాంగ్రెస్‌ నేతలకే తెలియాలని…

ఐఏఎస్‌లు పాఠశాలలు సందర్శించాలి

– విద్యార్థుల సంఖ్యకనుగుణంగా వసతులు – పాఠశాలల్లో సోలార్‌ కిచెన్లు ఏర్పాటు చేయాలి – పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఇంటర్‌లో చేరేలా చూడాలి – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను…

రేర్‌ ఎర్త్‌ ఎగుమతులపై ప్రత్యామ్నాయం చూడండి

– చైనా ఆంక్షల ప్రభావంతో పలు కంపెనీల ఉత్పత్తికి ముప్పు – తెలంగాణ తయారీ రంగం సంక్షోభం ఎదుర్కొంటోంది – కేంద్ర మంత్రులు పీయుష్‌ గోయల్‌, అశ్వినీ వైష్ణవ్‌లకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి న్యూదిల్లీ, జూన్‌ 25: రేర్‌ ఎర్త్‌ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన దరిమిలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ…

లంచం తీసుకునేంత దారిద్య్రం లేదు

కర్నాటక మంత్రి జమీర్‌అహ్మద్‌ఖాన్‌ బెంగళూరు, జూన్‌ 25: పేదలకు కేటాయించే ఇళ్ల లబ్ధిదారులనుంచి లంచం తీసుకునేంతటి దరిద్రం తనకు లేదంటూ కర్నాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ మండిపడ్డారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారుల నుంచి తాను లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానన్నారు.…

కొనసాగుతున్న ‘ఆపరేషన్‌ సింధు’

న్యూదిల్లీి, జూన్‌ 25 : ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధు’ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌ ద్వారా ఇజ్రాయెల్‌, ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తోంది. పొరుగు దేశాలకు చెందిన పౌరులకు కూడా భారత్‌ ఆపరేషన్‌ సింధు ద్వారా సాయం చేస్తోంది. ఈ ఆపరేషన్‌…

ఎమర్జెన్సీ  అనుభవాలపై పుస్తకం

ఎక్స్ ‌వేదికగా వెల్లడించిన ప్రధాని మోదీ  న్యూ దిల్లీ, జూన్‌ 25: ‌దేశంలో ఎమర్జెన్సీ విధించి జూన్‌ 25‌తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాడు ఎదురైన పరిస్థితులు, ఇబ్బందులపై ’ది ఎఎమర్జెన్సీ డైరీస్‌’ ‌పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ‌ద్వారా మోదీ  వెల్లడించారు. అత్యవసర పరిస్థితి…