prajatantra_news

prajatantra_news

యూరియాపై ప్రణాళికలు రూపొందించండి

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: కేంద్రం ప్రకటించిన విధంగా సరఫరాలు జరుగుతాయని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా జిల్లాల వారీ ప్రణాళిక చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దిగుమతి యూరియాలో మన రాష్ట్రానికి కేటాయించిన యూరియా సరఫరా జరగకపోవడం మూలంగా దేశీయంగా ఉత్పత్తయ్యే యూరియాను కేటాయించవల్సిందిగా…

హామీలు అమలుకాక దివ్యాంగుల్లో అసంతృప్తి

-అమలు కోసం ఉద్యమం చేపడతామని సీఎంకు లేఖ -బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తున్నాదివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలుకాకపోవడం వల్ల ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

జలాశయాలను ఏపీకి అప్పనంగా అప్పగించారు

– తిరిగి మన వాటా రాబట్టేందుకు పోరాటం – ఎన్‌డిఎస్‌ఏ మార్గదర్శకాలకనుగుణంగా కాళేశ్వరం బ్యారేజిల పునరుద్ధరణ -మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: ఆంద్రప్రదేశ్‌కు కృష్ణా జలాశయాలను అప్పనంగా అప్పగించిన ఘనత ముమ్మాటికీి బీఆర్‌ఎస్‌ పాలకులదేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.…

దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల బంద్‌

~ పది ట్రేడ్‌ యూనియన్ల మద్దతు ~ పాల్గొన్న 25కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు న్యూదిల్లీి, జూలై 9: కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ట్రేడ్‌ యూనియన్‌ సంస్థలు బుధవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 10 సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్లు బంద్‌లో పాల్గొన్నాయి. ట్రేడ్‌ యూనియన్లకు…

సంక్షేమంతోపాటు అభివృద్ధికి పెద్ద పీట

– కీలకం కానున్న హ్యామ్‌ రోడ్లు – అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ ఏరియాలుగా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత – రోడ్లు భవనాల శాఖ సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో సంక్షేమంతోపాటు అభివృద్ధికి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తున్నామని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల…

ప్రాజెక్టులపై చట్టసభల్లో చర్చకు సిద్ధం

-క్లబ్బుల్లో, పబ్బుల్లో కాదు -ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 9: నీళ్లు, నిధులకు సంబంధించి కెసీఆర్‌ కుటుంబం చేసిన తప్పిదాలను మీ ముందు పెట్టామని ప్రజా భవన్‌ లో వుధవారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరించారు. అధికారం కోల్పోయి, ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి, ఆ తరువాత…

సీసీఐ, ఎస్‌ఐఐఎల్‌ పునరుద్ధరణకు చొరవ చూపండి

కేంద్ర మంత్రికి రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణలో మూతపడిన రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పునరుద్ధరణకు చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డి.కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని బుధవారం…

కల్తీకల్లు ఘటనలో మరొకరు మృతి

మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలన్న ఎంపీ ఈటల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 9: కల్తీ కల్లు కేసులో ఐదుగురు నిర్వాహకులను బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న నగేశ్‌ గౌడ్‌, బి.శ్రీనివాస్‌ గౌడ్‌, టి. శ్రీనివాస్‌ గౌడ్‌, టి.కుమార్‌ గౌడ్‌, తీగల రమేశ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిర్వాహకులకు…

త్వరితగతిన ఇండ్లు పూర్తిచేయాలి

యాదాద్రి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 9: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన వాటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, ఇళ్లు పూర్తి అయిన లబ్ధిదారులకు విడతల వారీగా రూ.5 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతి సోమవారం జమ చేయనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. వలిగొండ మండలంలోని నాతాళ్లగూడెం…

లక్ష్య సాధనకు పేదరికం అడ్డుకాదు

– మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జులై 9: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్ఫోసిస్‌ సంస్థ ఏర్పాటు చేసిన కంప్యూటర్ల…