prajatantra_news

prajatantra_news

కొత్త చీఫ్‌ జస్టిస్‌గా ఏకే సింగ్‌

రాష్ట్రపతి ఆమోదముద్ర.. గెజిట్‌ జారీ హైదరాబాద్,ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ ఆమోదముద్ర వేశారు. వెంటనే కేంద్ర న్యాయ శాఖ గెజిట్‌ ప్రచరణ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌…

మంత్రి జూపల్లిని కలిసిన నటుడు గగన్‌ మాలిక్‌

\హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, జీటీవీ రామాయణంలో రాముడి పాత్రధారి, బుద్దిజం ప్రచారకుడు గగన్‌ మాలిక్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను బుద్ధవనం ప్రాజెక్ట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా మల్లేపల్లి లక్ష్మయ్య మంత్రి జూపల్లికి పరిచయం చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా…

సీఎంను కలిసిన ఎంపీ మల్లు రవి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14 : నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారంనాడు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మల్లు రవికి ముఖ్యమంత్రి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, పజాసేవలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. అలాగే టీపీసీసీ సభ్యుడు…

గ్రూప్‌ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్‌ ఉచిత శిక్షణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా గ్రూప్‌-1, 2, 3, 4, ఆర్‌ఆర్‌బి, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకు పరీక్షలకు అర్హులైన అభ్యర్థులకు 150 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపికైన వారికి రూ.1000 చొప్పున స్టైఫండ్‌ ఇవ్వనున్నారు. ఈమేరకు టీజీ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు…

షోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యం

– సమష్టి కృషితోనే పౌష్టిక తెలంగాణ సాధ్యం – భాగస్వామ్య పక్షాల రాష్ట్రస్థాయి సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14 : షోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మిషన్‌ మోడ్‌లో పనిచేస్తున్నదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన…

రిజర్వేషన్ల బిల్లు ఆమోదింపజేయండి

– బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్‌ వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: తెంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాం.. అధికారంలోకి రాగానే న్యాయపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి కుల సర్వే చేయించాం అని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో…

బియ్యంపై క్రెడిట్‌ కొట్టేయడం తగదు

-బీసీ రిజర్వేషన్లలో మత రిజర్వేషన్లు చేర్చడం సరికాదు – నల్గొండ పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నల్గొండ, ప్రజాతంత్ర, జులై 14: రేషన్‌ కార్డులను పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతున్నదన్న సమాచారం అందుతోంది.. అందువల్ల రేషన్‌ కార్డుల పంపిణీ కోసం తుంగతుర్తి వస్తున్న ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్‌ చేస్తున్నాం అర్హులైన ప్రతి ఒక్కరికీ…

సీనియర్‌ నటి బి.సరోజాదేవి కన్నుమూత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: సినీ వినీలాకాశంలో సీనియర్‌ నటి బి.సరోజా దేవి(87) బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం కన్నుమూశారు. తెలుగు, కన్నడ, తమిళ భాషా సినిమాల్లో ఆమె అక్కినేని, ఎన్టీరామారావు, ఎంజీఆర్‌ల వంటి వారితో పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు. 1938లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 1955లో మహా కవి కాళిదాస…

సినిమా షూటింగ్‌లో విషాదం

స్టంట్‌ ఆర్టిస్ట్‌ రాజు మృతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14 : తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్‌ సమయంలో గుండెపోటుకు గురై స్టంట్‌ ఆర్టిస్టు ఎస్‌ఎం రాజు (52) చనిపోయారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో ఆర్య, దర్శకుడు పా రంజిత్‌తో చేస్తున్న సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది.…

నాటి తప్పిదాలను మాపై రుద్దుతున్నారు

– పాలేరు నుంచి సాగర్‌ ఆయకట్టుకు నీరు విడుదల – బీఆర్‌ఎస్‌పై మంత్రులు భట్టి, పొంగులేటి ధ్వజం ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 14: ఖమ్మంజిల్లాలోని పాలేరు సాగర్‌ జలాశయం నుంచి సాగర్‌ ఆయకట్టుకు నీటిని మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ…