prajatantra_news

prajatantra_news

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, ప్రజాతంత్ర, జులై 15: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారంనాటి సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, అదనపు ఈవో సిహెచ్‌.వెంకయ్య చౌదరిలతో కలిసి ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార…

దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం

కాల్పుల్లో సీపీఐ నేత మృతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: నగరంలోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. సీపీఐ హైదరాబాద్‌ సిటీ కమిటీ సభ్యుడైన చందు రాథోడ్‌పై మంగళవారం ఉదయం ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. వాకింగ్‌ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శాలివాహననగర్‌లోని పార్కు వద్ద ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు.…

మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ఇరిగేషన్‌ శాఖలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ దృష్టిసారించింది. ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్‌, ఈఈ నూనె శ్రీధర్‌లను ఏసీబీ అరెస్టు చేసిన విషయం విదితమే. తాజాగా మాజీ ఈఎన్‌సీ చెట్టి మురళీధర్‌ రావు బంజారాహిల్స్‌లోని ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు…

రాష్ట్రాన్ని, కేంద్రాన్ని కాపాడతా

రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత సికింద్రాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: బోనాలు పండుగ సందర్భంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమాలలో ఒకటైన సంప్రదాయ రంగం సోమవారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సంవత్సరం భవిష్యవాణిలో దైవవాణి మాతంగి స్వర్ణలత తీవ్ర ఉద్వేగభరితమైన హెచ్చరిక స్వరాన్ని వినిపించింది. తొలుత ప్రజల…

నీటి సమస్యల పరిష్కారానికి చొరవచూపాలి

కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: తెలంగాణకు సంబంధించిన పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా, గోదావరి బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి లేఖ రాశారు.…

పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలి

– మంత్రి శ్రీధర్‌బాబు మహాముత్తారం, ప్రజాతంత్ర, జులై 14: ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు మహా ముత్తారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.1.20 కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని, రూ.73.50 లక్షలతో నిర్మించిన సహకార గోదాము, కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి,…

యావత్‌ భారత్‌కు తెలంగాణ ఓ రోల్‌ మోడల్‌

-తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చరిత్రాత్మకం -రాష్ట్రవ్యాప్తంగా 5.61 లక్షలకు పైగా రేషన్‌ కార్డులు మంజూరు -నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 14: నిరుపేదలకు తెల్లరేషన్‌ కార్డుల పంపిణీ మంజూరులో యావత్‌ భారత్‌కే తెలంగాణ రాష్ట్రం ఓ రోల్‌ మోడల్‌గా నిలిచిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

రేషన్‌ కార్డు పేదోడి ఆత్మగౌరవం

– ఈ ప్రాంతానికి దేవాదుల నుండి గోదావరి జలాలు తరలిస్తాం – ఆడపడుచులను ప్రభుత్వరంగ సంస్థలకు యజమానులను చేశాం – స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం అమలయ్యేలా చూస్తాం – తుంగతుర్తిలో రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ తుంగతుర్తి, ప్రజాతంత్ర, జులై 14: తెలంగాణలోని ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వం…

ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు

రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు చింతకాని, ప్రజాతంత్ర, జులై 14: ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టండి.. ప్రతివారం ఇంటి బిల్లులు చెల్లిస్తాం.. మీరు ఎంత త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటే అంత త్వరగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అన్ని పార్టీలను పిలవండి.. అందరూ కలిసి ముగ్గుపోసే కార్యక్రమాన్ని పండుగలా చేయాలి.. గృహప్రవేశానికి…

స్వామి వారి సేవలో మండలి డిప్యూటీ చైర్మన్ 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ…