prajatantra_news

prajatantra_news

రామావతారంలో హనుమంత వాహన సేవ

– యాదగిరిగుట్టలో 8వ రోజుకు బ్రహ్మోత్సవాలు – రాత్రికి క‌నువిందుగా క‌ల్యాణోత్స‌వం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. లోక కల్యాణం…

సోనియా చలవతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం

– ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం ఆమె మానస పుత్రికలు – డిసెంబర్ 2027 నాటికి దేవాదుల పూర్తి – వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి – సన్న బియ్యం పంపిణీతో పేదల కళ్ళలో వెలుగులు – కాళేశ్వరం బ్యారేజీలో సమగ్ర సాంకేతిక అధ్యయనం – మంత్రి కెప్టెన్…

భూదాన్ భూముల్లో ఇళ్లన్నీ నేలమట్టం

– రెండో రోజూ కొనసాగింపు ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధి లోని 147,148,149 సర్వే నెంబర్లలో దాదాపు 21 ఎకరాల 7 కుంటల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు బుధవారం కూడా జరిగింది. రెవెన్యూ, పోలీసులు, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో మంగళవారం కూల్చ‌గా మిగిలిన ఇళ్లన్నింటినీ బుధవారం…

బంజారాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

– సంత్ సేవాలాల్ చూపిన మార్గాన్ని అనుసరించాలి – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రాష్ట్రంలోని బంజారా కులస్తుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అన్ని రంగాలలో బంజారా కులస్తులు అభివృద్ధి చెందాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.…

స్పీకర్ కోర్టులో మరో ఇద్దరి భవితవ్యం

– కడియం, దానంలపై తుది విచారణ – 27, 28వ తేదీల్లో విచారణకు సిద్ధం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవ హారం కీలక దశకు చేరుకొన్నది. ఇప్పటికే 8 మంది విషయంలో స్పీకర్ స్పష్టమైన తీర్పును ఇచ్చారు. వీరు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తీర్పును ఇచ్చారు. ఇప్పుడు మరో…

8‌వ తరగతి పాఠ్యాంశంలో ’న్యాయవ్య‌వస్థలో అవినీతి’

– తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు -వెంటనే తొలగిస్తామని ప్రకటించిన కేంద్రం న్యూదిల్లీ, ఫిబ్రవరి 25: ఎన్‌సీఈఆర్‌టీ  8వ తరగతి పాఠ్యాంశంలో ‘న్యాయవవస్థలో అవినీతి’ అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్‌ ‌కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. పాఠ్యాంశం లోని భాగాలను తొలగించేందుకు నిర్ణయించింది. పాఠ్యాంశంలో ఆవిధంగా వచ్చి ఉండాల్సింది కాదని, దీనికి బదులు స్ఫూర్తిదాయకమైన విషయాలను రాసి…

ఆటోవాలాలకు ‘హరీష్ అన్న ఆత్మీయ భరోసా’

– ఆటో కార్మికుల కుటుంబాలకు బీమా భద్రత – ఇప్పటివరకు 18 కుటుంబాలకు ₹36 లక్షల బీమా – తాజాగా రెండు కుటుంబాలకు ₹4 లక్షల చెక్కులు – సొంత ఇంటిని తనఖా పెట్టి కార్మికులకు అండ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : సిద్దిపేట అభివృద్ధికి ఆటో కార్మికులే నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు అని…

మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

– అభ్యర్థుల వివరాలు విడుదల చేసిన ఎంహెచ్ఎస్‌ఆర్ బోర్డు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు అభ్యర్థుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచఎసఆర్‌బీ) విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 28వ తేదీ వరకూ…

చెవి నొప్పితో హాస్పిటల్‌కి వెళితే..

– యువకుడి మృతి – డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మని కుటుంబీకుల ఆందోళ‌న‌ నిజమాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 25:  జిల్లాలో ఘోరం జరిగిపోయింది. చెవి నొప్పితో ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లో చేరిన యువకుడు మృతిచెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికొచ్చిన కొడుకు అర్ధంతరంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో  హాస్పిటల్‌ ‌పరిసరాల్లో…

తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు

– ప్రజలకు గౌరవప్రదమైన సేవలే లక్ష్యం – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…