prajatantra_news

prajatantra_news

అకాల వ‌ర్ష బాధిత రైతుల‌ను ఆదుకోవాలి

– దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించిన బీఆర్ఎస్ నాయ‌కులు నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను  బీఆర్‌ఎస్‌ ‌నాయకులు పరిశీలించారు. వరి, అరటి, మామిడి పంటలు దెబ్బతిన్నాయని అన్నారు.…

డిజిపిని కలిసిన హ్యాట్రిక్ ‘ఓవరాల్ ఛాంపియన్’ విజేత‌లు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 6: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇటీవల ముగిసిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ లో హ్యాట్రిక్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించిన‌ తెలంగాణ పోలీస్ ప్రతినిధులు డిజిపి బి శివధర్ రెడ్డిని డిజిపి కార్యాలయంలో సోమవారం కలిశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పోలీస్ బృందం వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్…

పాత బస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా?

– దౌర్జన్యాలు, దొంగతనాలకి అనుమతిచ్చారా – అధికారులు, పోలీసులపై దాడి చేస్తున్నా చర్యలు తీసుకోరేం – మీ చేతగానితనానికి నిదర్శనం ఇదే – కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేదు – పాత బస్తీనే అభివృద్ధి చేయలేరు.. ఆదిలాబాద్ అభివృద్ధి ఓ జోక్ – సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి హైదరాబాద్,…

ఉద్యోగాల సృష్టిక‌ర్త‌లుగా ఎద‌గాలి

– డిజిట‌ల్‌, మౌలిక స‌దుపాయాల్లో భార‌త్ అద్భుత ప్ర‌గ‌తి – ఏఐతో ఉద్యోగాల‌కు ముప్పు -కొలంబియా బిజినెస్ స్కూల్ చ‌ర్చా గోష్ఠిలో కేటీఆర్‌ న్యూయార్క్, ఏప్రిల్ 6: భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించేవారుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు.…

నిశ్శ‌బ్దంగా పెరుగుతున్న జీవ‌న‌శైలి వ్యాధులు

– 30 యేళ్ల పైబ‌డిన వారిలో వేగంగా పెరుగుద‌ల‌ – ముంద‌స్తు ప‌రీక్ష‌లు శ్రేయ‌స్క‌రం – నేడు ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 6: మనకు ఏ సమస్యలూ లేవు… ఆరోగ్యం బాగానే ఉంది అనిపించడం సహజం. కానీ నేటి పరిస్థితుల్లో అదే భావన చాలా మందిని ప్రమాదంలోకి నెడుతోంది. ఎందుకంటే డయాబెటిస్,…

అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం

– ఇక్క‌డ‌ సభ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన – రూ.1238 కోట్ల పనులకు శంకుస్థాపన చేశాం – ప్రజలే కేంద్రంగా మా పాలన – ప్రజల ఆలోచనే మా విధానం – పిప్రి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఈ రాష్ట్రంలో పుట్టడం పెరగడం మా అదృష్టం…

ఏమి చేసినా ప్రజల కోసమే

– అభివృద్ధిలో అందరినీ కలుపుకునిపోతాం – మా ఎమ్మెల్యేలు లేరని పనులను ఆపం – ప్రజలను ఇబ్బంది పెట్టడం మా అభిమతం కాదు – భట్టి నాటి ‘పీపుల్స్ మార్చ్‌’ హామీల అమలు షురూ – ఆదిలాబాద్ జిల్లాలో రూ.614 కోట్ల పనులji – ఎయిర్ పోర్టు తెస్తున్నాం – పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం –…

కోహెడ మార్కెట్ భూమిపై రేవంత్ రెడ్డి కన్ను

– రూ.3 వేల కోట్ల భూమిని అనుయాయులకు కట్టబెట్టే కుట్ర – పండ్ల మార్కెట్ సందర్శనలో మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం కోహెడ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఈరోజు ఇక్కడికి రాజకీయాల కోసం రాలేదు.. రైతుల కోసం వచ్చాను.. ఈ సమస్య బీఆర్ఎస్ పార్టీదో కాంగ్రెస్ పార్టీదో కాదు- ఇది రైౖతుల సమస్య అని…

రూ.225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణం

– ఆధునికీకరణ పనులకు సీఎం రేవంత్‌ ‌శంకుస్థాపన – ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ – మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం నిర్మల్‌/ఆదిలాబాద్,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌నిర్మల్‌ ‌జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా సోమ‌వారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో సీఎం…

ఆరు గ్యారెంటీలపై గ్రామాలకు వెళితే తెలుస్తుంది

– ఏ మేరకు అమలు జ‌రిగిందో ప్రజలను అడగండి – కేరళకు వెళ్లి అబద్దాలు ప్రచారం చేయడం కాదు – మాజీ మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి విమర్శలు నల్లగొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌కేరళంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి  గొప్పలు చెబితే అక్కడ రేవంత్‌ను చూసి వోటేసేదెవర‌ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ ‌రెడ్డి…