prajatantra_news

prajatantra_news

జీసీసీల గమ్యస్థానంగా హైదరాబాద్

–  మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల(జీసీసీల) ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా ఎంచుకున్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. నైపుణ్యాలతో కూడిన టేలెంట్ పూల్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్య లేని రోడ్లు, అందుబాటులో…

మహిళా విద్యకు ఆద్యులు ఫూలే దంపతులు

– ఓబీసీల, మహిళాభ్యున్నతికి చేసిన కృషి చిరస్మరణీయం – జ్యోతిరావు ఫూలేకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ఓబీసీల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు మహాత్మా జ్యోతిరావు ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. సామాజిక విప్లవకారుడైన జ్యోతిరావు ఫూలే 200వ జయంతి…

హైదరాబాద్-విజయవాడ మధ్య కొత్త‌ విమాన సర్వీసు

– ఫ్లై91 విమాన సర్వీసును ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం/విజయవాడ, ఏప్రిల్ 10 హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై-91 తన నూతన సర్వీసులను తెలుగు రాష్ట్రాల మధ్య అధికారికంగా ప్రారంభించింది. రెండు రాజధానుల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంతోపాటు, సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసే లక్ష్యంతో…

ఆపరేషన్ డ్రగ్ ఫ్రీ సిటీపై ఫోక‌స్‌

– రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులతో విస్తుపోయే నిజాలు – 75శాతం మంది రౌడీషీటర్లు గంజాయి బానిసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ డ్రగ్ ఫ్రీ సిటీ’ ఇపుడు పెను సంచలనం సృష్టిస్తోంది. రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్…

కేబుల్ ఛానల్ జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు రాష్ట్ర, జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డులు పొందటానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నగర కేంద్రంగా స్టూడియోలు కలిగి స్థానికంగా, జిల్లాలలో ప్రసారాలు అందించే చానళ్ళు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్డులు…

పదేళ్లలో తెలంగాణను ఆగం చేశారు

– ఇప్పుడేమో ఘనకార్యాలు చేసినట్లు బిల్డప్ – ఎమ్మెల్యే హరీష్ రావుపై మండిపడ్డ మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: గత ప్రభుత్వ నాయకులకు సరైన ఆలోచన, అవగాహన లేక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. నీళ్లు లేనిచోట మాత్రం పదేళ్లలో అనేక ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. కాళేశ్వరం…

సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవాలి

– ఆదివాసీల రేల పాట, డోలు, డప్పు ఐకమత్యానికి నిదర్శనం – ‘కోయ ఇలవేల్పుల చరిత్ర’ ఆవిష్కరఱలో మంత్రి సీతక్క భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు మర్చిపోకుండా రాబోయే తరానికి అందిస్తూ మన సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకుంటే దేశానికి మూలం ఆదివాసులం అనే నినాదానికి సార్ధకత ఏర్పడుతుందని పంచాయతీరాజ్,…

యువతి ఆత్మహత్య

– నిశ్చితార్థం అయిన వ్య‌క్తి హెచ్ఐవి రక్తం ఎక్కించడంతో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : హెచ్ఐవీ రక్తం ఎక్కించిన సంఘటనలో బాధితురాలు శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలోని తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన…

వణుకుతున్న వయసు..

– వృద్ధులకే కాదు.. యువతకూ తప్పని ముప్పు – భారత్‌లో పెరుగుతున్న కేసులు – నేడు ప్రపంచ పార్కిన్సన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: చేతులు వణకడం, నడకలో తడబాటు, మతిమరుపు.. ఇవన్నీ వృద్ధాప్య లక్షణాలని సరిపెట్టుకుంటే పొరపాటే. ఇది ప్రమాదకరమైన పార్కిన్సన్స్ వ్యాధి కావచ్చు. ఒకప్పుడు అరవై ఏళ్లు…

సీడబ్ల్యూసీలో సీఎం రేవంత్

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన దిల్లీలోని ఇందిరా భవన్‌లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షిద్, అంబికా సోనీ, సచిన్ పైలట్, భూపేష్…