prajatantra_news

prajatantra_news

మానుకోట‌ పట్టణాభివృద్ధికి రూ.59.62కోట్లు

– పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన మ‌హ‌బూబాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 13: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ప్ర‌భుత్వం సమన్వయంతో అమలు చేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మహబూబాబాద్ పట్టణ పరిధిలో పలు అభివృద్ధి పనులకు…

పిన‌పాక మండ‌లంలో పురావ‌స్తు శాఖ త‌వ్వ‌కాలు

– ప్రాగైతిహాసిక మెగాలిథిక్ స్థలంగా గుర్తింపు – ఇనుప‌ యుగం నాటి నాగ‌రిగ‌త అధ్య‌యనం ల‌క్ష్యం పినపాక, ప్రజాతంత్ర, జనవరి 13 : పురావస్తు శాఖ‌ (ఏఎస్ఐ) హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దేవనగరం–పాండురంగాపురం గ్రామ పరిధిలో ఉన్న ప్రాగైతిహాసిక మెగాలిథిక్ స్థలంలో మంగళవారం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఈ తవ్వకాలను…

యూరోపియన్ పార్లమెంట్ డీజీ మాంగోల్డ్‌తో సీఈవో భేటీ

– డిజిటల్ దుష్ప్రచారాన్ని అడ్డుకునే మార్గాలపై చర్చలు బ్రస్సెల్స్/హైదరాబాద్, జనవరి 13: ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, సోషల్‌మీడియా ఆధారిత దుష్ప్రచారాన్ని అడ్డుకునే అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి యూరోపియన్ పార్లమెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ క్రిస్టియన్ మాంగోల్డ్‌తో మంగళవారం కీలక భేటీ నిర్వహించారు. ఎన్నికల వ్యవస్థ నిర్మాణం, ప్రజలతో…

ధాన్యం కొనుగోలులో తెలంగాణ రికార్డ్

– ఖరీఫ్ 2025-26 లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు – ధాన్య సంపదకు సంక్రాంతి ప్రతీక – రాష్ట్ర‌ రైతాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 13ః ధాన్యం కొనుగోలులో రాష్ట్రం రికార్డు సృష్టించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్…

మున్సిప‌ల్ పోరులో ఒంటిగానే బ‌రిలోకి

– బీజేపీ నాయ‌కుడు కాదూరి యాచ‌య్య‌ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 13: దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీ కి దక్కింద‌ని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మంగ‌ళ‌వారం ఆయ‌న మాట్లాడుతూ బోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు…

పంచాయ‌తీల‌కు రూ.277 కోట్లు విడుద‌ల‌

– స‌ర్పంచ్‌ల‌కు పండగ శుభాకాంక్ష‌లు తెలిపిన డిప్యూటీ సీం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌వ‌వ‌రి 13: సంక్రాంతి పండుగ రోజు గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ. 277 కోట్ల నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణ‌యం తీసుకున్నారు.…

అట్టహాసంగా కైట్ ఫెస్టివల్ ప్రారంభం

‌- దాదాపు 19 దేశాల నుంచి కైట్‌ ‌ప్లయర్స్ ‌హాజరు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13 కనువిందు చేసే కైట్లు, నోరూరించే స్వీట్లతో.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరు గుతున్న ఇంటర్నేషనల్ స్వీట్స్ అండ్ కైట్స్ ఫెస్టివల్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెలంగాణా మిగతా 2లో..పర్యాటక…

గాంధీ పేరుతో కాంగ్రెస్‌ ‌నీచ రాజకీయం

– పథకాలతో సహా అన్నిటికి ఇందిర, రాజీవ్‌ ‌పేర్లేనా – వాల్మీకి-అంబేడ్కర్‌ ‌పేరున్న పథకం పేరు ఎందుకు మార్చారు – కాంగ్రెస్‌ ‌రాజకీయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి – కరీంనగర్‌ ‌మున్సిపాలిటీలో బిజెపి జెండా ఎగరేస్తాం – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలు కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 13: ఉపాధి హా పథకం పేరు…

కాంగ్రెస్‌ ‌పార్టీలో కవితను చేర్చుకునే అవకాశం లేదు

– బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యతు లేదు.. రాదు – కేసీఆర్‌ ‌కుటుంబ అవినీతిపై కవిత వ్యాఖ్యలే నిదర్శనం – మీడియాతో పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 13: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరబోతున్నారంటూ కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌…

విజయవాడ రహదారిలో కొనసాగుతున్న రద్దీ

– భారీగా వాహనాల రాకతో ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 13: సంక్రాంతి సెలవులు రావడంతో పట్నం పల్లె బాట పట్టింది. శనివారం నుంచే స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో ఆదివారం వరకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. ఎల్బీ నగర్‌, ఎం‌జీబీఎస్‌, ‌జేబీఎస్‌, ‌శివారులోని ఉప్పల్‌ ‌రింగ్‌ ‌రోడ్‌, ‌కూకట్‌పల్లి, ఆరంఘర్‌ ‌చౌరస్తా, గచ్చిబౌలి,…