prajatantra_news

prajatantra_news

ప‌దేళ్ల కేసీఆర్‌ పాల‌న‌లో ఒక్క రేష‌న్‌ కార్డు ఇవ్వ‌లేదు

– పాల‌మూరును ఎండ‌బెట్టారు – ఆంధ్ర‌కు నీళ్లిచ్చారు – అసెంబ్లీలో చ‌ర్చిద్దామంటే మూడు నిషాలుండ‌లేదు – మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర, జనవరి 14; ప‌దేళ్ల‌  కేసీఆర్ పాలనలో ఒక రేషన్ కార్డు గాని ఒక్క ఇల్లు ఇవ్వలేదని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.  కొత్తకోటలో రూ.15 కోట్ల అభివృద్ధి…

మహిళా ఐఏఎస్‌పై అసభ్య కథనాలు

-టీవీ ఛానల్‌ ‌జర్నలిస్టుల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14: రాష్ట్రంలో ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిని కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన కేసులో సెంట్రల్‌ ‌క్రైమ్‌ ‌స్టేషన్‌ ‌పోలీసులు దూకుడు పెంచారు. తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం తరఫున సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ ‌రంజన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు డిజిటల్ మీడియా,…

18న మేడారానికి ముఖ్యమంత్రి, మంత్రుల రాక

– భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు – 19న గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం – అధికారులతో ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష ములుగు, ప్రజాతంత్ర, జనవరి 14: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు మంత్రులు ఈ నెల 18న మేడారానికి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ…

మహిళా అధికారులపై అసభ్య వార్తలు గర్హనీయం

– సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14 : రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత విలువైనదని, సమాజానికి ప్రాణవాయువు వంటిదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రిటైర్డ్‌ లోకాయుక్త (గోవా) జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి పేర్కొన్నారు. పరిమితుల్లేని స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇవ్వలేదని తెలిపారు.…

అందరితో ఆనందంగా జరుపుకునేదే పండుగ

– డాక్టర్‌ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 14: పండుగ అంటే అందరినీ కలుపుకుని ఆనందంగా జరుపుకునేదని కాకతీయ వర్సిటీ పాలకమండలి సభ్యురాలు, వరల్డ్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ అడ్వైజర్‌, అనురాగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి చెప్పారు. హన్మకొండ ప్రభుత్వ దివ్యాంగ బాలికల ఆశ్రమాన్ని…

ఇందిర బాటలో నడుస్తున్న రేవంత్‌

– జర్నలిస్టుల అరెస్టు పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14: జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో తీవ్రంగా ఖండించారు. ఇది రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ప్రమాదకరమైన దాడిగా అభివర్ణించారు. ఈ ఘటన కాంగ్రెస్‌…

ములుగు జిల్లా రద్దు కాదు .. ఆందోళన చెందొద్దు

– మంత్రి సీతక్క స్పష్టీకరణ ములుగు, ప్రజాతంత్ర, జనవరి 14: ములుగు జిల్లా రద్దవుతుందని జరుగుతున్న ప్రచారాన్ని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ఎస్‌ హయాంలో నూతన జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని, పాలనా సౌలభ్యాన్ని పట్టించుకోకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా అస్తవ్యస్తంగా జిల్లాల సరిహద్దులను నిర్ణయించారని ఆక్షేపించారు.…

తెలుగు ప్రజల జీవన విధానానికి ప్రతీక సంక్రాంతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14: తెలుగు ప్రజల జీవన విధానానికి, గ్రామీణ సంస్కృతికి, వ్యవసాయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ సంక్రాంతి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ఏడాదిపాటు రైతు చేసిన కష్టానికి ఫలితం దక్కే ఈ పర్వదినం కుటుంబాలను, గ్రామాలను, సమాజాన్ని ఒక్కటిగా కలిపే మహత్తర ఉత్సవం. సూర్యుడు మకర రాశిలోకి…

తెలుగు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14: మన సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయానికి ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ సంక్రాంతి. కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన ఆనందాన్ని కుటుంబీకులతో, స్నేహితులతో, పొరుగువారితో పంచుకునే అపూర్వమైన సందర్భం ఇది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే ఈ సంక్రాంతి పండుగ తెలుగు ప్రజల…

వ్యక్తిగత బ్యాంకు ఖాతాలపై సర్కార్ నజర్!

– చలాన్ల పేరిట జనం జేబులకు చిల్లు – తప్పిదానికి తక్షణ శిక్ష – పాలనా వైఫల్యంపై మాత్రం మౌనం – భద్రతా లోపాలకు బాధ్యత ఎందుకు ఉండదు? “ప్రభుత్వ యంత్రాంగం కేవలం ప్రజల నుంచి వసూళ్లు చేయడమే పరమావధిగా పెట్టుకుంది తప్ప తన వైఫల్యాలకు బాధ్యత వహించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదని ఈ నిర్ణయం…