త్యాగానికి ప్రతీక బక్రీద్
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది బక్రీద్ పండగ. త్యాగానికీ, బలిదానానికి ప్రతీకయైన బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ ప్రతి సంవత్సరం జిల్ హజ్ మాసంలో జరుపుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. బక్రీద్ అంటే ‘‘బకర్ ఈద్’’ అని అర్థం. ‘‘బకర్’’ అంటే జంతువని, ‘‘ఈద్’’ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును…
