కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు

– పదేళ్లు దండుపాళ్యం బ్యాచ్‌ ‌లాగా దోచారు
– మరోమారు హరీష్‌ ‌రావుపై మండిపడ్డ మంత్రి అడ్లూరి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌27: ‌కవిత చేసిన ఆరోపణలకు ముందు హరీష్‌ ‌రావు  సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీష్‌ ‌రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌మండిపడ్డారు. కుటుంబంలో గొడవలు పెట్టుకున. మంత్రివర్గాన్ని విమర్శించడమేంటని మండిపడ్డారు. మేమే రాజులం.. మేమే మంత్రులం అన్నట్లుగా పరిపాలన చేశారు. పదేళ్లు పాలించిన హరీష్‌రావు రాష్ట్ర కేబినెట్‌లో పంపకాల గురించి మాట్లాడుకున్నారంటూ మాట్లాడతారా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారా? అబద్దాలు పదిసార్లు చెప్పి నిజం అని నమ్మించే పనిలో ఆయ‌న‌ ఉన్నారని  అంటూ మంత్రి ధ్వజమెత్తారు. కేబినెట్‌ ‌మంత్రులపై చేసిన వ్యాఖ్యలకు  హరీష్‌ ‌రావు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్‌ ‌చేశారు. ‘దండుపాళ్యం అని మమ్మల్ని అంటున్నావు.. పదేళ్లు రు స్టువర్టుపురం దొంగల్లా పంచుకున్నారా..?, పదేళ్లు  కేబినెట్‌లో అసలు మాట్లాడే అవకాశమే లేదు కదా..? ఐతే రు..  బామ్మర్ది?  మామే కదా..? మాట్లాడింది. కనీసం హోంమంత్రిని కూడా ప్రజా భవన్‌కు రానియని చరిత్ర ది. సామాన్య కార్యకర్తలే ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. దళితులు.. బలహీన వర్గాల బిడ్డలం కేబినెట్‌లో ఉన్నాం. బడుగు.. బలహీన వర్గాలు అంటే నీకు ఎందుకు అంత చిన్నచూపు. కేబినెట్‌ ‌ద విషం కక్కినావు. హరీశ్‌రావు నామినేషన్‌ ‌వేసే సిద్దిపేట వేంకటేశ్వర స్వామి ఆలయంకి రమ్మంటే తోక ముడిచాడు.  హరీష్‌ ‌రావు? అంబేద్కర్‌ ‌విగ్రహం దగ్గరికి వస్తా అని.. ఇప్పటి మేము కాదు.. మా కొప్పుల ఈశ్వర్‌ ‌వస్తాడు అంటున్నారు. తోక ముడిచావు హరీశ్‌రావు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడటం మానుకో అంటూ మంత్రి లక్ష్మణ్‌ ‌హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page