వ్యాపారంగా మారిన విద్య‌

– ఎల్‌కేజీకే లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారు
– నిరుద్యోగం, ఫీజుల దోపిడీ, ప్రభుత్వ వ్యవస్థల నిర్వీర్యంపై పోరు
– క్యా బోల్తీ పబ్లిక్‌ ‌పేరిట దేశవ్యాప్త పర్యటనలు
– ప్రెజర్‌ ‌గ్రూపుగా పనిచేసేందుకే నిర్ణయం
– కాక్రోచ్‌ ‌జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే

ముంబై, ఆగస్ట్ 6 :‌ విద్యార్థి నిరసనలతో దేశం దృష్టి ఆకర్షించిన సీజేపీ కీలక ప్రకటన చేసింది. ‘క్యా బోల్తీ పబ్లిక్‌’.. అం‌టే ప్రజలు ఏమంటున్నారు పేరుతో కాక్రోచ్‌ ‌జనతా పార్టీ(సీజేపీ) దేశవ్యాప్తంగా కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కేప్రకటించారు. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రజల ఆందోళనలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవడం, అభిప్రాయాలను తీసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని సీజేపీ స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ ‌నుంచి దేశవ్యాప్తంగా పర్యటించి ప్రతి ఒక్కరితో మమేకమవుతామని దీప్కే తెలిపారు. సీజేపీ ఒక రాజకీయ పార్టీగా మారకుండా ఒక ఒత్తిడి బృందంగానే కొనసాగుతుందని ప్రకటించారు. మహారాష్ట్రలో నిర్వహించిన పార్టీ ప్రధాన బృంద సమావేశం అనంతరం దీప్కే ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం లేదని, ప్రజల తరఫున ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రెజర్‌ ‌గ్రూప్‌గా పనిచేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్య, ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల అధిక ఫీజులు, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో తగ్గుతున్న విశ్వాసం వంటి అంశాలపై ఉద్యమాన్ని మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ ప్రచారంలో విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘ఈ రోజు మన దేశంలో సంస్థాగత జవాబుదారీతనం ప్రమాదకర స్థితిలో ఉంది.. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదకర సంకేతం.. గతంలో ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకునేవారు. ఈ రోజు ఎవరు ఓటు వేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తోంది.. ప్రజాస్వామ్యం ఇలా పనిచేయదు.. మనం ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని సరిదిద్దాలి.. మనం ఇది చేసేవరకు దేశంలో ఎన్నికల అవకతవకలు కొనసాగుతాయి’ అని దీప్కే పేర్కొన్నారు. నిరుద్యోగం దేశంలో ఒక ప్రధాన సమస్య అని, దీనిని దేశవ్యాప్త సమస్యగా పరిగణిస్తామని తెలిపారు. నాణ్యమైన విద్య రోజురోజుకూ భారంగా మారుతోందని, అందుకే ఆ అంశంపైనే తొలుత తాము దృష్టి సారిస్తామని చెప్పారు. ఒకటో తరగతికే ఫీజులు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది.. కొన్ని పాఠశాలల్లో ఇంకా ఎక్కువే ఉంటున్నాయి.. మధ్యతరగతి కుటుంబాలు ఆ మొత్తాన్ని ఎలా భరిస్తాయి.. ఈ ఖర్చుల వల్ల ప్రజలు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది.. ఆ భారం తగ్గాలని తమ పార్టీ కోరుకుంటోంది అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌చెప్పిన ప్రకారం విద్య ప్రాథమిక హక్కు.. అయితే కొన్నేళ్లుగా అది ఒక వ్యాపారంగా మారిపోయింది’ అని దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రచారంలో పాల్గొనాలనుకునే వారు అధికారిక క్యూఆర్‌ ‌కోడ్‌లను స్కాన్‌ ‌చేయాలని సూచించారు. ఆ క్యూఆర్‌ ‌కోడ్‌లను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. సభ్యత్వం పూర్తిగా ఉచితమని చెప్పారు. మోసపూరిత చెల్లింపు అభ్యర్థనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయ పార్టీల పరిస్థితి దారుణంగా ఉందంటూ ప్రజలు ఉదయం ఒక పార్టీకి ఓటేస్తే సాయంత్రంకల్లా మరో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆయన అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *