హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించేందుకు వోటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఇందుకోసం కోర్టు కస్టడీలో ఉన్న ఆయన పాస్ పోర్టులను తాత్కాలికంగా విడుదల చేయాలని ఆదేశించింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో విదేశీ పర్యటన చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పాస్ పోర్టులను తాత్కాలిక కస్టడీనుంచి విడుదల చేయడంతోపాటు విదేశీ ప్రయా ణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు పిటిషన్ ను పాక్షికంగా అనుమతించింది. విదేశీ పర్య టనకు అనుమతి ఇస్తూనే కోర్టు పలు షరతులు విధించింది. లక్ష వ్యక్తిగత బాండ్ తోపాటు ఒక ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి ప్రయాణ వివరాలు, అక్కడ బస చేసే చిరునామాలు, సంప్రదింపు ఫోన్ నంబర్లు కోర్టుకు అందజేయాలని పేర్కొంది. అలాగే, సెప్టెంబర్ 18లోగా పాస్ పోర్టులను తిరిగి కోర్టులో జమ చేస్తానని అఫిడవిట్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించింది. ఆ అఫిడవిట్ సమర్పించిన అనంతరం ప్రాంతీయ పాస్ పోర్టు అధికారికి లేఖ రాసి పాస్ పోర్టులను తాత్కాలికంగా అప్పగించాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




