“వెనిజులా సార్వభౌమత్వాన్ని మంటగలిపిన ట్రంప్ ను ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో సమర్ధించడం,నోబెల్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ కు బహూకరించడం విడ్డూరం. వెనిజులా లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రయత్నించకుండా అధికార దాహంతో వెనిజులా నాయకులు అధికార పీఠం కోసం ప్రాకులాడడం సిగ్గుచేటు. ఇపటికే వెనెజువెలా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది..”
హిట్లర్ ను మించిన నియంతగా ట్రంప్ పేరు చరిత్రలో నిలిచిపోయే అవకాశమున్నది. ట్రంప్ వైఖరి వలన అమెరికా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది.వెనిజులా సార్వభౌమత్వం పై ట్రంప్ జరిపిన సాయుధ దాడి ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు. మరోవైపు ట్రంప్ యుద్ధోన్మాదంతో మధ్య ప్రాచ్యం రణరంగంలా మారుతున్నది. ఇరాన్ పై అమెరికా కత్తులు నూరుతుంటే, ఇజ్రాయిల్ పాలస్తీనా పై దాడులకు సిద్ధంగా ఉంది. చైనా తైవాన్ ఆక్రమణకు సంసిద్ధంగా ఉంది. బంగ్లాదేశ్,పాకిస్తాన్ లు భారత్ ను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతుంటే, రష్యా- ఉక్రెయిన్ల మధ్య నాలుగు సంవత్సరాలుగా నిరంతర యుద్ధం జరుగుతున్నది. డోనాల్డ్ ట్రంప్ తనకు తానుగా శాంతి దూతగా వర్ణించు కుంటూ, ఎనిమిది యుద్ధాలను ఆపగలిగానని ప్రగల్భాలు పలుకుతూ, మరో వైపు ఇరాన్ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తూ, యుద్దానికి సై అంటున్నాడు.
వెనెజువెలా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసి తానే ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడినంటూ ప్రకటించుకున్న డోనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలను కూడా ఇదే విధంగా గుప్పెట్లో పెట్టుకోవాలని కుటిల నీతి ప్రదర్శిస్తున్నాడు. వెనిజులా సార్వభౌమత్వాన్ని మంటగలిపిన ట్రంప్ ను ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో సమర్ధించడం,నోబెల్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ కు బహూకరించడం విడ్డూరం. వెనిజులా లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రయత్నించకుండా అధికార దాహంతో వెనిజులా నాయకులు అధికార పీఠం కోసం ప్రాకులాడడం సిగ్గుచేటు.

ఇపటికే వెనెజువెలా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్ధిక అంతరాలు విపరీతంగా పెరిగి పోయాయి. కేవలం కొద్దిమంది చేతుల్లోనే సంపదంతా కేంద్రీకృతమైపోయింది. భారీ సంఖ్యలో ప్రజలు పేదరికం తట్టుకోలేక ఇతర దేశాలకు వలస పోతున్నారు. వెనిజులాలో ఇలాంటి అస్తవ్యస్త మైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని,పారదర్శకమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో అమెరికా వెనిజులా అధ్యక్షుడిని నిర్భంధించి న్యూయార్క్ కు తరలించుకుపోవడం వెనిజులా సార్వభౌమత్వాన్ని పరిహసించడం కాదా? నార్కో టెర్రరిజం పేరుతో మదురో పై నిందారోపణలు చేసిన అమెరికాకు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అందుకు తగిన విధమైన చర్యలు తీసుకునే అవకాశమున్నా, అందుకు విరుద్ధంగా కారకాస్ పై దాడిచేయడం
గతంలో ట్రంప్ పై మదురో చేసిన వ్యాఖ్యలకు ప్రతీకార ధోరణి తీర్చుకున్నట్టుగా ఉంది.వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో పదవీచ్యుతి,నిర్బంధం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనాయి. అమెరికా దౌర్జన్యాన్ని కొన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. కొన్ని దేశాలు ట్రంప్ కు భయపడి గుంభనంగా ఉండిపోయాయి. అమెరికా శతృ దేశాలతో సహా, కొన్ని మిత్ర దేశాలు,మరికొన్ని నాటో సభ్య దేశాలు ట్రంప్ తీరును తీవ్రంగా తప్పు బట్టాయి.

రష్యా,చైనా,ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా కారకాస్ పై అమెరికా సాగించిన సాయుధ దుస్సాహసాన్ని ప్రపంచ శాంతికి విఘాతం లా పేర్కొన్నాయి. అమెరికాలోని కొంత మంది విపక్ష సభ్యులతో పాటు, స్వపక్షం లోని నేతలు, అమెరికా ప్రజలు ట్రంప్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. అయితే ఇంత తతంగం జరుగుతున్నా, వెనెజువెలా అమెరికా గుప్పెట్లోకి జారిపోయినా, తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ సైతం అమెరికా చెప్పుచేతల్లోనే పని చేసి, అమెరికాకు చమురు దోచి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నా, వెనిజులా ప్రజలు మాత్రం అమెరికా దాడిని,జరుగుతున్న సంఘటనలను పెద్దగా పట్టించు కోవడం లేదు. పైగా మదురో నిర్భంధం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చి ఆనందం వ్యక్తం చేస్తూ,నియంత పీడ విరగడైనదని ఆనందంతో సంబరాలు జరుపుకున్న తీరు ఆశ్చర్యంగా ఉంది ఎందుకిలా జరుగుతున్నది? అసలు వెనెజువెలా లో ఏం జరిగింది? ఏం జరగబోతున్నది? వెనిజులా ప్రజలు తమ దేశ సార్వభౌమత్వ పరిరక్షణ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? అనే అంశాలపై సునిశిత పరిశీలన చేసి,విశ్లేషణ జరపడం అవసరం.
నిజానికి అపారమైన చమురు నిల్వలు గల వెనెజువెలా అత్యంత సంపన్న దేశంగా ఉండాలి. కాని పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి.వెనెజువెలా ఆర్ధికంగా వెనకబడే ఉంది.కారుచౌకగా చమురు ఎగుమతులు చేయడం వలన ఇతర చమురు సంపన్న దేశాల కంటే,వెనెజువెలా కు చమురు వలన లభించే ఆదాయం పడిపోయింది.కేవలం చమురు మీద ఆధార పడడం, ఇతర రంగాలను నిర్లక్ష్యం చేయడం చమురు ధరలు తగ్గినప్పుడు తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం వంటి పరిణామాలు అక్కడ జరుగుతున్నాయి. అమెరికా ఆంక్షలు కూడా వెనెజువెలా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసాయి.ఆదాయం తగ్గి,ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరింది.సౌదీ అరేబియా, అమెరికాల కంటే వెనెజువెలా లో అధిక నిరూపిత చమురు నిల్వలు (ప్రోవెన్ ఆయిల్ రిజర్వ్స్) కలిగి ఉన్నా, ఆదాయం మాత్రం అతి తక్కువగానే ఉంది. “రిచ్ ఇన్ ఆయిల్- పూర్ ఇన్ వెల్త్” గా వెనిజులా ఆర్థిక ముఖచిత్రం మారింది. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 10 వ బలమైన ఆర్థిక వ్యవస్థగా బలమైన ఆదాయ వనరులున్న దేశంగా ఎదిగి స్వర్గ ధామంలా విలసిల్లిన వెనిజులా నేడెందుకు దీనంగా మారింది? వెనెజువెలాలో చమురు వెలికి తీయడం, శుద్ధి చేయడం వంటి ప్రక్రియ ఖరీదైన వ్యవహారం కావడంతో కార్పోరేట్లు ఈ అవకాశం అంది పుచ్చుకుని దేశాభివృద్ధిలో పాలు పంచుకున్నారు.
ఇది నచ్చని అప్పటి వెనెజువెలా అధ్యక్షుడు హ్యోగో చావెజ్ చమురు బావులను ప్రైవేటు పెట్టుబడి దారుల నుండి దూరం చేసాడు. పెట్టుబడిదారులను వెళ్ళగొట్టాడు. ప్రజలను ఉచిత పథకాల పేరుతో బిచ్చగాళ్లుగా చేసి, వారిని పని చేయనీయ కుండా సోమరి పోతులుగా మలచి,ఇంటికే పరిమితం చేసి తాను ఆడిందే ఆటగా పాడిందే పాటగా దేశాన్ని ఆర్ధికంగా నాశనం చేసి, ప్రజలను ఉచితాలతో మభ్యపెట్టాడు.సుఖాలకు అలవాటు పడ్డ వెనెజువెలా ప్రజలు చావెజ్ ను మెచ్చుకుంటూ, కాలక్షేపం చేసారు. దేశం లో ఉత్పాదక శక్తి క్షీణించి పోయింది. పని చేయడం బద్దకంగా మారింది. అన్ని రంగాలు క్షీణించాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రజలు ఆకలితో అలమటించి, పొట్ట చేత పట్టుకుని దేశం వదలిపోయారు. బలమైన ఆర్థిక వ్యవస్థ అప్పుల పాలైనది. పెట్టుబడులు పెట్టేవారు కరువైనారు. చావెజ్ ప్రజల మానసిక దౌర్భల్యాన్ని ఉచిత పథకాలతో మాయ చేసి తనకు అనుకూలంగా మలచుకుని అధికారం చెలాయించాడు. శ్రమ శక్తిని విచ్ఛిన్నం చేసి, శ్రమించడాన్ని తెలివి తక్కువ తనంగా భావించి, ప్రజలను ఉచితాల విందులో తేలియాడించి , దేశాన్ని అధోగతి పాలు చేసాడు. చివరకు అత్యధిక విలువ గల అతి పెద్ద నోటును వెనెజువెలా ప్రభుత్వం ముద్రించింది. తిండి పెట్టలేని కరెన్సీ నోట్ల కట్టలను ప్రజలు చెత్త కుప్పల్లో పడేశారు.
చావెజ్ మరణానంతరం నికోలస్ మదురో వెనిజులా అధ్యక్షుడై,నియంతగా మారి,ఎన్నికలను బూటకంగా మార్చి, ప్రతిపక్షాలను అణచి వేసి పాలన సాగించాడు. ఉచితాలను మరిగిన ప్రజలు దేశం దివాళా తీయడంతో గగ్గోలు పెట్టారు. దేశంలో ఆకలి కేకలు మిన్నంటాయి. దాదాపు 80 శాతం మందికి పైగా ప్రజలు ఉపాధి లేక,తిండి లేక బ్రెజిల్,కొలంబియా,అర్జెంటీనా దేశాలకు వలస పోయారు. సంపన్న దేశం పాలకుల అధికార దాహంతో, దూరదృష్టి లేని పాలనతో అడుక్కుతినే పరిస్థితిలోకి నెట్టబడింది. వెనిజులా ఆర్థిక పతనానికి దారితీసిన పాలకుల అనాలోచితమైన ఆర్ధిక విధానాల ఘోర వైఫల్యాల ఫలితాన్ని అక్కడి ప్రజలు అనుభవిస్తున్నారు.
చైనా బిలియన్ల డాలర్ల కొద్దీ వెనెజువెలా లో పెట్టుబడులు పెట్టింది. వెనెజువెలా తీసుకున్న అప్పులకు బదులుగా చైనా వెనిజులా నుండి కారుచౌకగా చమురు కొనుగోలు చేస్తున్నది. చమురు క్షేత్రాలపైనే కాకుండా, పలు రంగాల్లో చైనా పెట్టుబడులు పెట్టింది.వెనెజువెలా పై అమెరికా జరిపిన దాడి వలన, వెనెజువెలా అమెరికాకు పాదాక్రాంతం కావడం వలన చైనా కు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.

ఒకప్పుడు వెనిజులా నుండి భారత్ భారీ స్థాయిలో చమురు కొనుగోలు చేసింది. కాని వెనిజులా పై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్ వెనిజులా నుండి చమురు దిగుమతులను తగ్గించుకుంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో వెనిజులా భారత్ కు చమురు సరఫరా చేస్తుందా? ఇందుకు అమెరికా అంగీకరిస్తుందా?ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా నుండి భారత్ చమురు కొనుగోళ్ళు తగ్గించుకున్నా, అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి.గయానా నుండి భారత్ భారీగా ఆయిల్ దిగుమతులు జరిపే అవకాశముంది. వర్తమాన పరిస్థితుల నేపథ్యంలో వెనెజువెలా గనుక భారత్ కు చమురు సరఫరా చేస్తే భారత్ కు మేలు జరుగుతుంది.మరి రష్యా సంగతేంటి? రష్యాతో గల అవినాభావ సంబంధాన్ని భారత్ తెంచుకోగలదా? అందుకు భారత ప్రజలు అంగీకరిస్తారా? అమెరికా దురహంకారం భారత్ కు సంకటం లా మారింది.భారత్ ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో డోనాల్డ్ ట్రంప్ రూపంలో భారత్ అనేక క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అమెరికా విధిస్తున్న టారిఫ్ లను తట్టుకుంటూ వేరే మార్గంలో ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ, దేశం ఆర్థికంగా ముందుకు సాగడానికి కృషి చేస్తున్నది.
ట్రంప్ భారత్ ను “డెడ్ ఎకానమీ” గా అభివర్ణించినా, అమెరికా కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరించినా, భారతీయ విద్యార్ధులపై, ఉద్యోగులపై వీసాల భారం మోపుతూ, భారతీయుల ఉద్యోగాలకు ఎసరు పెట్టాలని చూస్తున్నా ఇంతవరకు భారత్ అమెరికాను గాని ట్రంప్ ను గాని పల్లెత్తు మాట అనకుండా, బలవంతునితో వైరం ప్రమాదకరమన్న రీతిలో సహనం పాటించడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రపంచం ఒకప్పటిలా గిరిగీసుకుని కూర్చునే పరిస్థితులు లేవు. ప్రతీ దేశానికి ఇతర దేశాలతో అవసరం ఏర్పడింది. వాణిజ్య,సాంకేతిక రక్షణావసరాలు ప్రపంచ దేశాల మనుగడకు అవసరం. అయితే అమెరికా లో ట్రంప్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. తనను వ్యతిరేకిస్తున్న దేశాలతో ఎవరూ సంబంధాలు పెట్టుకోవద్దంటూ ట్రంప్ బెదిరించడం,అందుకు తగ్గట్టుగానే కక్ష సాధింపు చర్యలకు దిగడం వలన భారత్ తో పాటు అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితులు మారాలని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. వెనిజులా దుస్థితి తమకు రాకూడదని చిన్న చితకా దేశాలు మౌనంగా ఉంటున్నాయి.
వెనిజులా విషయంలో అమెరికా ఘోర తప్పిదం చేసిందని అనేక దేశాలు భావిస్తున్నప్పటికీ, బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పడానికి భయపడుతున్నాయి.
మదురో ను వెంటనే విడుదల చేయాలని రష్యా డిమాండ్ చేసింది. వెనిజులా ను ఆక్రమించాలన్న దురుద్దేశ్యం తమకు లేదని, కేవలం నేరారోపణల పైనే మదురో ను అరెస్టు చేసామని అమెరికా ఒకవైపు చెబుతూనే, వెనెజువెలా చమురును తమ ప్రత్యర్ధి దేశాలకు విక్రయించవద్దని,రష్యా చైనా,ఇరాన్,క్యూబా దేశాలను పక్కన బెట్టాలని అమెరికా హుకుం జారీ చేయడం దేనికి సంకేతం? ఒక వైపు వెనెజువెలాపై సాయుధ దాడి చేయడం, మరోవైపు గ్రీన్ లాండ్ ఆక్రమణకు సంసిద్ధం కావడం, క్యూబా,మెక్సికో లను హెచ్చరించడం అమెరికా దురహంకార ఆధిపత్య ధోరణికి దర్పణం పడుతున్నది. ప్రస్తుతం ఇరాన్- అమెరికాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రంప్ ధోరణి మధ్య ప్రాచ్యంలో అశాంతికి పురిగొల్పుతున్నది. ఈ పరిస్థితులనుండి ప్రపంచాన్ని కాపాడేవారెవరు? ట్రంప్ ధోరణి ఇలాగే కొనసాగితే చైనా,రష్యాలతో పాటు మరికొన్ని అమెరికా వ్యతిరేక దేశాలు కూటమిగా ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితులు మరో మహా సంగ్రామం వైపు దారితీయవచ్చు. ఈ సారి ప్రపంచ యుద్ధం గనుక సంభవిస్తే అణుబాంబులతో యావత్ భూగోళం భస్మీపటలం కాక తప్పదు.

-సుంకవల్లి సత్తిరాజు.
మొ:9704903463
తూ. గో.జిల్లా