బండి సంజ‌య్ కు ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సంపూర్ణ మద్దతు : కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల

ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ న్యూ జెర్సీలో లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ బండి సంజ‌య్ ను హిందు హృదయ్ సామ్రాట్ ఫైర్ బ్రాండ్ గా, పవర్ బ్రాండ్ గా, తెలంగాణ బీజేపీ ఇమేజ్ ట్రాన్స్ఫార్మర్ బ్రాండ్ గా, నలభై యేండ్లు ఆర్.ఎస్.ఎస్ తీర్చిదిద్దిన మట్టిలో మాణిక్యం అని తెలుపుతూ,అసలు బిజెపి ఎక్కడ ఉంది అన్నోడికి చెంపపెట్టులో భాగ్య నగరం నడిబడ్డున ఉప్పెంగె కాషాయపు సముద్రం చూపిన కమల దళపతి మన సంజయ అన్న, సవాల్ కీ “సై అంటె సై ” అని బీజేపీ ఎక్కడ, అన్నోడికి తెలంగాణ ఢంకా మొగించి రికార్డు స్థాయిలో మున్సిపల్ సీట్లు, అసెంబ్లీ ఎన్నికలో ఉత్కంఠబరమైన దుబ్బాక, హుజూరాబాద్ భారీ విజయం కైవసం చేసుకుని, మునుగోడు అసెంబ్లీ ఎన్నికలో నైతిక విజయం సాధించిన బండి సంజయ్ అంటే మా గుండెలోతు ల్లో అభిమానం ఉంది, ఆ అభిమానాన్ని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డు లో బండి సంజయ్ ఫోటోలు, బీజేపీ పైన ఉన్న అభిమానాన్ని చూపించాం, అదేవిధముగా, మహాసంగ్రామ యాత్రలో 5 విడుతలు, యావత్ తెలంగాణలో తెలంగాణ ప్రజల గుండెలకు చెరువై వెయ్యి కిమీ నడిచిన సందర్భంలో ప్రింట్ / ఎలక్ట్రానిక్ మీడియాలో / సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ బండి సంజయ్ కు మద్దతు ఇవ్వడాన్ని గుర్తు చేసారు విలాస్ రెడ్డి.అదే విధంగా ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ తరుపున తెలంగాణ కమిటీ లు అమెరికా వ్యాప్తముగా 20 రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం, అందులో భాగముగా తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలలో చేస్తున్నాం, దీనికి అన్ని రాష్ట్రాలలో తెలంగాణ చాఫ్టర్ల యొక్క టీం /జట్టు సహాయ సహాకారాలు అని , వారి సహాయముతో పెద్ద ఎత్తున చేస్తున్నట్టు విలాస్ రెడ్డి తెలిపారు.ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ (OFBJP ) , తెలంగాణ బీజేపీ కోశాధికారి శాంతా కుమార, తెలంగాణ బీజేపీ కార్యదర్శి జయ శ్రీ  ఇతర తెలంగాణా మిత్రులు నిర్వాహించినా ఈ సభలో కృష్ణారెడ్డి ఏనుగుల (అఫ్-బీజేపీ జాతీయ పూర్వ అధ్యక్షులు ), విలాస్ రెడ్డి జంబుల (తెలంగాణ అఫ్-బీజేపీ జాతీయ కన్వీనర్) , వంశీ యంజాల (తెలంగాణ అఫ్-బీజేపీ న్యూ జెర్సీ ప్రాంతీయ కన్వీనర్), ప్రదీప్ రెడ్డి కట్ట (తెలంగాణ అఫ్-బీజేపీ న్యూ జెర్సీ ప్రాంతీయ కో-కన్వీనర్), మధుకర్ రెడ్డి (తెలంగాణ అఫ్-బీజేపీ మీడియా కో-కన్వీనర్ ), మరియు తెలంగాణ అఫ్-బీజేపీ సీనియర్ మద్దతు దారులు గోవింద్ రాజ్, ప్రవీణ్ తడకమళ్ల , ప్రవీణ్ అండపల్లి , కృష్ణ మోహన్ మూలే , రఘు కనుగొ, సంతోష్ రెడ్డి లింగాల, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, శంకర్ రెడ్డి, అదే విధముగా కమ్యూనిటీ లీడర్స్ శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, రామ్ వేముల , లక్ష్మి మోపర్తి , విజయ్ కుందూరు, హేమచందర్ రావు, గోపి మరియు ఆటా నాటా, మాటా,టాటా తెలుగు సంఘాల నుండి వివిధ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *