రెండ్రోజుల పాటు పర్యటన
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 5 : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 28న వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ నిర్వహించనున్నారు. 29న హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ నేతల సమావేశంలో రాహుల్ తెలంగాణ పర్యటన తేదీలను ఖరారు చేశారు. రాహుల్ రాకతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ రానుందని స్థానిక నేతలు అన్నారు.