– పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, కృష్ణా, గోదావరులు పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు సంపూర్ణంగా నిండాలని, మంచి వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలనే ఆకాంక్షతో వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(వైటీడీ) అర్చక, సిద్ధాంతులు ఈనెల 10న వరుణ యాగం నిర్వహించేందుకు మూహూర్తం నిర్ణయించారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదపండితులు, అర్చక బృందం సమక్షంలో మహా వరుణ యాగాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర మహాయాగం కృష్ణా నది తీరాన నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున, విజయవిహార్ ఆవరణలో జరుగుతుంది. ఆరోజు సాయంత్రం 3.24 గంటలకు జరిగే పూర్ణాహుతి మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో జరగనున్న ఈ వరుణయాగ మహా కార్యక్రమంలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య ఆశీర్వచనాలు పొంది ఈ పుణ్యకార్యాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆలయ ధర్మకర్తల మండలి ప్రజలను ఆహ్వానించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




