స్వరాష్ట్రం పబ్‌ ‌కల్చర్‌ ‌కోసమేనా..?

  • హైదరాబాద్‌లో ఘటనలు ఆందోళనకరం
  • టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ •ంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి
  • జగిత్యాలలో తీవ్ర ఇసుక కొరత ఉందని వెల్లడి

జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 5 : ‌పబ్‌ ‌కల్చర్‌తో అనర్థాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి అన్నారు. పబ్‌ ‌కల్చర్‌ ‌కోసమేనా తెలంగాణా తెచ్చుకున్నది అని, కేటిఆర్‌ ‌చెప్పిన అభివృద్ధి ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపులో లేవని జీవన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. గంజాయి, బెల్టుషాపులు లేని ఊరే లేదని అంటూ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని ప్రభుత్వం పోత్సాహిస్తుందని, బెల్టు షాపులతో ప్రభుత్వ ఆదాయం అమాంతం పెరిగిపోతుందన్నారు. జిల్లా కలెక్టర్‌, ‌రెవెన్యూ, ఆబ్కారీ శాఖలు దాడులు చేయడం లేదని విమర్శించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వి•డియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…విచ్చలవిడి మద్యంతో కనీస విలువలు లేకుండా పోతున్నాయని, పబ్‌ ‌కల్చర్‌తో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయన్నారు.

హైదరాబాద్‌లో శాంతి భద్రతలు లేకపోవడంతో పెట్టుబడులు రావడం లేవన్నారు. రూ. 32 వేల కోట్లు కేవలం ఆబ్కారీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వొస్తుందని, మద్యాన్ని ప్రోత్సాహించడం ద్వారా.. 90 శాతం ప్రమాదాలు జరుగుతునట్లు తెలిపారు. డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌లతో కూడా ఆదాయం సమకూరుతుందని, అక్రమ మద్యాన్ని ప్రోత్సహిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. గంజాయి, బెల్టు షాపులు లేని ఊరు లేదని, మద్యపాన నిషేదంతోనే ప్లలె ప్రగతి సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు..జగిత్యాలలో ఇసుక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. నిర్మాణ రంగంలో ఇసుకను అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కానీ..అలా జరగడం లేదన్నారు. ఇసుక దొరక్క పోవడంతో జగిత్యాల జిల్లాలో నిర్మాణాలు ఆగిపోయినట్లు, ఇల్లు కట్టుకోవడానికి సామాన్య ప్రజలు ట్రాక్టర్‌లలో ఇసుకను తీసుకెళుతుంటే.. పోలీసులు అడ్డుకోవడం శోచనీయమన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *