సీఎం రేవంత్ రెడ్డిని నిరుద్యోగులే దించుతరు

  • యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచారు
  • తేదీలతో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఎక్కడా?
  • కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తనివి గా చెప్పుకోవడం సిగ్గుచేటు
  • జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం
  • నిరుద్యోగులకు మద్దతుగా జులై 15న సెక్రటేరియట్ ను ముట్టడిస్తాం
  • సర్కారుకు విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ హెచ్చరిక
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్ 29: యూత్ డిక్లరేషన్ ప్రకారం తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థినేత మోతిలాల్ నాయక్ కు మద్దతుగా బీసీ జనసభ, గిరిజన రిజర్వేషన్ సాధన సమితి, సేవలల్ సేనా, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య, ఓయూ జేఏసీ నాయకులతో కలిసి అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గర నిరసనకు దిగారు. నిరసనకు దిగిన వివిధ సంఘాల నాయకులను అరెస్ట్ చేసి, గోషామహల్ స్టేడియంకు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి నిరుద్యోగుల కోసం గాంధీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థి మోతిలాల్ ప్రయాణానికి హాని జరిగితే..ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
రెండు లక్షల ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చెందారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మోతిలాల్ తీవ్ర అనారోగ్యం పాలు కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు పై ఉన్న శ్రద్ధ గిరిజన విద్యార్థి అయిన మోతిలాల్ నాయక్ ఆరోగ్యం పై సీఎం రేవంత్ రెడ్డికి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. అధికారంలోకి రాకముందు రాహుల్ గాంధీని అశోక్ నగర్ చౌరస్తాలో టీ తాగించి డ్రామాలాడించి, నిరుద్యోగులు రెచ్చగొట్టి వారి ద్వారా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు వారి నిర్లక్ష్యం చేయడం అత్యంత హేయమని చర్యగా పేర్కొన్నారు. ఆరోజు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే.. జాబ్ కేలండర్ ఇచ్చి – 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని మాట తపడాన్ని తీవ్రంగా విమర్శించారు. గ్రూప్-2లో 2,000, గ్రూప్-3లో 3,000 వరకు పోస్టులు పెంచాలని అన్నారు. అలాగే..గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్ప త్తిలో అభ్యర్థులను పిలవాలని కోరారు. డీఎస్సీ పోస్టులను 11 వేల నుంచి 25 వేలకు పెంచాలి అని – రూ.4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేసారు.
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి..అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు కావస్తున్నా..నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని అన్నారు. ఇప్పటికీ మిగిలింది ఇక కేవలం 5 నెలలు మాత్రమేనని, ఈ ఐదు నెలల్లో మిగతా రెండు లక్షల ఉద్యోగాలని ఎట్లా భర్తీ చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి, నిరుద్యోగుల యువకులను రేవంత్ రెడ్డి వంచిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగులే తగిన గుణపాఠం చెప్తారని రాజారాం యాదవ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన రిజర్వేషన్ సాధన సమితి, సేవలాల్ సేన అధ్యక్షులు సంజీవ నాయక్ మాట్లాడుతూ..గిరిజన విద్యార్థి అయిన మోతిలాల్ నాయక్ ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం అత్యంత విచారకరమని అన్నారు.
వెంటనే ఉద్యోగ ప్రకటన చేయాలని, రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మా ఆదివాసి బిడ్డ సీతక్కకు.. గిరిజన బిడ్డ మోతిలాల్ ను ఓదార్చే సమయం లేకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. మా బడుగు బలహీన వర్గాల బిడ్డలంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య అధ్యక్షులు కొంపల్లి రాజు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ గారు బీసీ జన సభ రాష్ట్ర నాయకులు తొడంగి గోవర్ధన్ గారు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ ముదిరాజు గారు శ్రీ కృష్ణ యాదవ సంఘం యాదద్రి జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేశం యాదవ్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి శ్రీరాం శరత్ యాదవ్,మండల ప్రధాన కార్యదర్శి బాత్క అశోక్ యాదవ్,బోల్లు నరసింహ యాదవ్,రాజశేఖర్ యాదవ్ దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *