సిద్ధిపేటలో చాయ్ తాగిన రోజులు గుర్తొచ్చి ఆగి చాయ్ తాగిన సీఎం కెసిఆర్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: సిద్దిపేట సభ అనంతరం హైదరాబాద్ వెళుతున్న సీఎం కెసిఆర్ ఒక్క సారిగా సిద్దిపేట దాబా వద్ద ఆగి చాయ్ త్రాగారు.. సిద్దిపేట చాయ్ త్రాగిన రోజులు గుర్తు చేసుకున్నారు.. ఢల్లీి కి రాజు అయిన తల్లికి కొడుకు అన్నట్టు… రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సిద్దిపేటకు బిడ్డ నే అనే మాటకు సీఎం కెసిఆర్ సాదా.. సీదగా సిద్దిపేట దాబా లో చాయ్ త్రాగి అశ్చర్యం కలిగించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గా సాధారణ వ్యక్తిగా తన పురిటి గడ్డ ఫై ప్రేమను చాటి చెప్పారు. సిద్దిపేట ప్రజల ఫై.. వారికీ ఉన్న అనుబంధానికి ఆత్మీయతకు.. సిద్దిపేట కుటుంబంగా భావించే నాయకుడు అనడానికి ఇదే గొప్ప నిదర్శనం. ఆయన వెంట మంత్రి తన్నీరు హరీష్ రావు తదితరులు ఉన్నారు.





