లక్నవరం చెరువులో పడి ఇద్దరు మృతి

హైదారబాద్‌ ఐఎస్‌బి విద్యార్థులుగా గుర్తింపు

ములుగు, ప్రజాతంత్ర, మే 31 : జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. లక్నవరం చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాగా, వారిద్దరూ హైదరాబాద్‌లోని ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌బిజినెస్‌ ఐఎస్‌బికి చెందినవారుగా గుర్తించారు. ఐఎస్‌బీకి చెందిన నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మొత్తం ఆరుగురు విద్యార్థుల బృందం లక్నవరం చెరువును చూసేందుకు వచ్చారు. అనంతరం సరదాగా సరస్సులోకి దిగారు.

ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు యువతీ, యువకుడు నీటిలో మునిగిపోయారు. తోటి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. వారిద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మృతులను సాయి ప్రీతమ్‌ (24), ‌తరుణి (20)గా గుర్తించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *