లండన్‌లో యూకేఐబీసీ-ఎస్‌ఎంఎం‌టీ సమావేశానికి హాసరైన మంత్రి కెటిఆర్‌

‌వరుస సమావేశాలతో బిజీబిజీ

హైదరాబాద్‌, ‌మే 19 : మంత్రి కేటీఆర్‌ ‌లండన్‌ ‌టూర్‌లో బిజీబిజీగా ఉన్నారు. యూకేఐబీసీ-ఎస్‌ఎంఎం‌టీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్‌ ఇం‌డస్టీ ప్రతినిధులతో కేటీఆర్‌ ‌సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎటక్ట్రిక్‌ ‌వెహికిల్‌ ‌రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని కేటీఆర్‌ ‌తెలిపారు.

విదేశీ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్నారు. రాష్ట్రంలో సమగ్రమైన, ప్రగతిశీల ఈవీ పాలసీని ప్రారంభించినట్లు కేటీఆర్‌ ‌తెలిపారు. ఇప్పటికే పలు ఈవీ కంపెనీలు తమ కార్యకలాపాలను తెలంగాణలో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయని కేటీఆర్‌ ‌గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *